‘కూటమి’ అరాచకాలు సహించం: ఆర్కే రోజా | Rk Roja Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

‘కూటమి’ అరాచకాలు సహించం: ఆర్కే రోజా

Jul 20 2025 3:13 PM | Updated on Jul 20 2025 4:33 PM

Rk Roja Fires On Chandrababu Government

సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ టి.రాజయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. పుత్తూరు మున్సిపాలిటీ 20వ వార్డు, వినాయకపురం ఎస్టీ కాలనీలో రాజయ్య ఆటోకు ఇటీవల దుండగులు నిప్పటించారు. ఈ ఘటన వెనుక ఉన్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను రోజా కోరారు. జీవనోపాధి కోసం నడుపుకుంటున్న ఆటోను రాత్రికి రాత్రే దుండగులు నిప్పుపెట్టడం అమానుషమన్నారు.

ఇటువంటి అరాచక చర్యలకు పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదు. ఇటువంటి దాడులకు పాల్పడుతున్న వారికి ప్రజలు బుద్ధి చెబుతారు’’ అని ఆర్కే రోజా హెచ్చరించారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగ్యాన్ని కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి.. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులను సహించేది లేదు’’ అంటూ ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ వర్గానికి చెందిన టి.రాజయ్య కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలి’’ అని ఆర్కే రోజా డిమాండ్‌ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement