తిరుపతి క్రైమ్: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి మాయ మాటలు చెప్పి దళిత యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. తిరుపతి రూరల్ మండలంలో నివాసముంటున్న 19 ఏళ్ల దళిత యువతికి కడపకు చెందిన యశ్వంత్‌రాజ అనే వ్యక్తి కొద్దికాలం కిందట ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నెల 21న ఆ యువకుడు తిరుపతికి వస్తున్నానని యువతికి తెలిపాడు.
ఇదే క్రమంలో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రనగర్‌లోని ఓ హోటల్ రూమ్‌కి తీసుకువెళ్లి యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన యువతి డీలాగా ఉండడంతో తల్లి గమనించి ఏమైందని ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు 24వ తేదీ రాత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


