GSLV-F16 ప్రయోగం సక్సెస్‌ | NASA ISRO Nisar Satellite Launch Live updates | Sakshi
Sakshi News home page

GSLV-F16 ప్రయోగం సక్సెస్‌

Jul 30 2025 5:39 PM | Updated on Jul 30 2025 6:16 PM

NASA ISRO Nisar Satellite Launch Live updates

సాక్షి,నెల్లూరు: ఇస్రో, నాసాల ఉమ్మడి ఉపగ్రహమైన నిసార్‌ శాటిలైట్‌  GSLV-F16 నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ ప్రయోగం విజయవంతమైంది. నింగిలోకి వెళ్లిన నిస్సార్‌ ఉపగ్రహం భూమిని స్కాన్‌ చేయడం ప్రారంభించింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తొలిసారిగా సంయుక్తంగా రూపొందించిన నాసా–ఇస్రో సింథటిక్‌ ఆపార్చర్‌ రాడార్‌ (నిసార్‌) అనే ఉపగ్రహం నిసార్‌ శాటిలైట్‌  GSLV-F16 నింగిలోకి దూసుకెళ్లింది. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ఈ ప్రయోగం ప్రారంభమైంది  

జియో సింక్రనస్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌16) రాకెట్‌ ద్వారా 2,392 కేజీల బరువు కలిగిన నిసార్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు ఇస్రో సైంటిస్టులు . 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి నిసార్‌ను ప్రవేశపెట్టారు.  భూగోళాన్ని పరిశోధించేందుకు ఎంతో దోహదపడే ఈ ఉపగ్రహం సుమారు 10 ఏళ్లు పాటు సేవలు అందిస్తుంది.  భూ కదలికలను నిశితంగా పరిశీలించేందుకు... దాదాపు 11 వేల 200 కోట్ల రూపాయలతో వ్యయంతో నాసా, ఇస్రో సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.

GSLV-F16 Launch: దూసుకుపోతున్న నిసార్

భవిష్యత్తులో ఇస్రో–నాసా కలిసి మరిన్ని ప్రయోగాలు.. 
ఈప్రయోగం సందర్భంగా  ఇస్రో, నాసా బంధం బలపడి రాబోయే కాలంలో మరో మూడు ప్రయోగాలను సంయుక్తంగా నిర్వహించేందుకు ఒప్పందం చేసుకున్నామని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.నారాయణన్‌ పేర్కొన్నారు. అలాగే, చంద్రయాన్‌–4 ప్రయోగ పనులకు శ్రీకారం చుడు­తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి గగన్‌యాన్‌–1 పేరుతో ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌­లో కూడా మరో నాలుగు ప్రయోగాలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement