చంద్రబాబు లక్షణం హింసను క్రియేట్‌ చేయడమే: సజ్జల | Sajjala Ramakrishna Reddy Reaction On Ambati Rambabu Arrest | Sakshi
Sakshi News home page

చంద్రబాబు లక్షణం హింసను క్రియేట్‌ చేయడమే: సజ్జల

Feb 1 2026 3:51 PM | Updated on Feb 1 2026 5:21 PM

Sajjala Ramakrishna Reddy Reaction On Ambati Rambabu Arrest

సాక్షి, గుంటూరు: ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది దేనికి?.. ప్రశ్నించే గొంతులను వేధించడానికా? అంటూ చంద్రబాబు సర్కార్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు.  ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసలేం జరుగుతోందంటూ ప్రశ్నించారు. ‘‘లడ్డూలో కొవ్వు కలిసిందని సీఎం హోదాలో బాబు చెప్పారు. బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారు?’’ అంటూ సజ్జల మండిపడ్డారు.

‘‘కల్తీ నిజమంటూ ప్లెక్సీలు వేసి దుష్ప్రచారానికి దిగారు. తప్పుడు ఫ్లైక్సీలను మా పార్టీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ నేతలను పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు. చట్టం.. గూండాలను, అరాచకశక్తులను రక్షించింది. మా పార్టీ నేతలకు ప్రాణాపాయం జరిగితే ఎవరిది బాధ్యత?. పోలీస్‌ ఉన్నతాధికారులకు బొత్స ఫోన్‌ చేసినా స్పందన లేదు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలి. మా పోరాటం అహింసాయుతంగా ఉంటుంది. కోర్టులను ఆశ్రయిస్తాం, గవర్నర్‌ను కూడా కలుస్తాం’’ అని సజ్జల పేర్కొన్నారు.

ఊరుపేరులేని ఫ్లైక్సీలను పోలీసులే తొలగించాలి. డీజీపీ, హోంమంత్రి సమాధానం చెప్పాలి. విడుదల రజిని, భూమన, బ్రహ్మనాయుడిపైనా దాడికి యత్నించారు. గతంలో టీడీపీ నేత పట్టాభి ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారు. చంద్రబాబు లక్షణం హింసను క్రియేట్‌ చేయడమే. ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి దాడులు చేయించారు. టీడీపీ అరాచకాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. డిజిటల్‌ బుక్‌లో అరాచకవాదుల పేర్లు ఎక్కిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక అరాచక వాదులకు శిక్ష తప్పదు. మాజీ హోంమంత్రిని ఎస్పీ ఆఫీస్‌ గేట్‌ ఎదుట వెయిట్‌ చేయించారు. లోకేష్‌ నోటి వెంట వచ్చే ప్రతి మాట బూతే’’ అని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.

 


 

 

 

Advertisement
 
Advertisement
Advertisement