తిరుపతి క్రైమ్: నగరంలోని కొర్లగుంటలో వివాహేతర సంబంధం వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం మేరకుం.. జీవకోనలో∙కారి్మకుడు పులి నరసింహరావు, అతడి భార్య సాంబలక్ష్మి (40) జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు హెచ్‌పీ గ్యాస్ డెలివరీ బాయ్ కె.సోమశేఖర్(37) అలియాస్ సోముతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర బంధం ఏర్పడింది. ఈ క్రమంలో సాంబలక్ష్మి సోమశేఖర్ డబ్బుల కోసం వేధించడం, దాడులు చేయడం జరిగిందని కుటుంబసభ్యులు వెల్లడించారు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం సంఘం డబ్బులు చెల్లించేందుకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన సాంబలక్ష్మి రాత్రి వరకు తిరిగి రాక పోవడంతో కుటుంబంలో ఆందోళన నెలకొంది. అర్ధరాత్రి సమయంలో పోలీసుల సమాచారం మేరకు కొర్లగుంటకు చేరుకున్న కుటుంబసభ్యులు, ఓ ఇంట్లో సాంబలక్ష్మి కత్తితో గొంతుకోసి హత్యకు గురై ఉండగా, సోమశేఖర్ చీరతో ఇనుప పైపునకు ఉరివేసుకుని మృతి చెందినట్టు గుర్తించారు. ఈ మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి, కాల్ డేటా, గత ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉండగా, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.


