అధ్యాపకురాలు సస్పెండ్
తిరుపతి సిటీ: తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత ప్రచారం కలకలంరేగింది. ఇంగ్లిష్ అధ్యాపకురాలు మాధవి బోర్డుపై రాస్తున్న అన్యమత వ్యాఖ్యలను కొందరు విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఘటనపై ప్రిన్సిపల్ స్పందిస్తూ.. అధ్యాపకురాలిని విచారించి, నివేదికను ఉన్నతాధికారులకు పంపించామన్నారు. దీంతో మాధవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


