
సాక్షి, తిరుపతి: తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వం తమ పెన్షన్‌లను తొలగించడంతో దివ్యాంగులు కలెక్టరేట్ ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో దివ్యాంగుల ఆందోళనలకు వైఎస్సార్‌సీపీ తిరుపతి ఇన్‌చార్జ్ భూమన అభినయ రెడ్డి మద్దతు పలికారు. దివ్యాంగులకు న్యాయం చేయాలని అభినయ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.