సాక్షి, తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఓ సైకో కలకలం సృష్టించాడు. చిన్న పిల్లలను వెంటాడుతూ చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. పిల్లలపై దాడి చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకున్న భక్తులు.. పోలీసులకు అప్పగించారు. సైకోను పశ్చిమబెంగాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
కాగా, గత మార్చి నెలలో ఓ యువకుడు మద్యం తాగి మాడ వీధుల్లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఓ మహిళతో గొడవకు దిగాడు. పీకలదాకా మద్యం తాగిన ఓ వ్యక్తి.. ‘‘నేను లోకల్’’ అంటూ.. తిరుమల మాడ వీధుల్లో తిరుగుతూ ఓ మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఇదే సమయంలో తాను మద్యం తాగుతాను.. కావాలంటే అక్కడ మద్యం కూడా అమ్ముతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక, విజిలెన్స్ అధికారుల ముందే ఇదంతా జరగడం గమనార్హం. అనంతరం, అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.



