ఆర్థిక అక్షరాస్యత కీలకం | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక అక్షరాస్యత కీలకం

Feb 10 2026 8:10 AM | Updated on Feb 10 2026 8:10 AM

ఆర్థి

ఆర్థిక అక్షరాస్యత కీలకం

తిరుపతి అర్బన్‌: ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్థిక అక్షరాస్యత కీలకపాత్ర పోషిస్తుందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావుతో కలసి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌కి చెందిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సురక్షిత బ్యాంకింగ్‌ విధానాలు పాటించడం, డిజిటల్‌ లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించడం, పొదుపు అలవాట్లు పెంపొందించుకోవడం, ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందడానికి ప్రజల్లో అవగాహన పెంచాల ని తెలిపారు. బ్యాంకింగ్‌ సేవలు, బీమా, పెన్షన్‌ పథకాలు, డిజిటల్‌ ఆర్థిక భద్రతపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ రవికుమార్‌, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శోభన్‌ బాబు, మధుసూదన్‌ పాల్గొన్నారు.

తిరుపతి ఐసర్‌తో మెల్బోర్న్‌ వర్సిటీ ఎంఓయూ

ఏర్పేడు: ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్‌ యూనివర్సిటీతో తిరుపతి ఐసర్‌ విద్యాపరమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి ఐసర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శంతాను భట్టాచార్య, మెల్బోర్న్‌ గ్లోబల్‌ సెంటర్‌ ఢిల్లీ డైరెక్టర్‌, మెల్బోర్న్‌ విశ్వవిద్యాలయంలో దక్షిణాసియా, మిడిల్‌ ఈస్ట్‌ డిప్యూటీ ప్రో వైస్‌చాన్సలర్‌ (ఇంటర్నేషనల్‌) ప్రొఫెసర్‌ ముత్తు పాండియన్‌ అశోక్‌కుమార్‌ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌ విశ్వవిద్యాలయంతో చురుకై న పరిశోధన, విద్యా సహకారానికి మద్దతు ఇవ్వడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మెల్బోర్న్‌ ఇండియా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అకాడమీ కింద తిరుపతి ఐసర్‌, మెల్బోర్న్‌ యూనివర్సిటీ జాయింట్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నాయన్నారు.

ఆర్థిక అక్షరాస్యత కీలకం 1
1/1

ఆర్థిక అక్షరాస్యత కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement