ప్రైవేటు బస్సు డ్రైవర్‌కు గుండెపోటు
బుచ్చినాయుడుకండ్రిగ: శ్రీకాళహస్తి నుంచి తిరువళ్లూరుకు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అరిగిలకండ్రిగ వద్ద వెళుతుండగా డ్రైవర్‌కు విధినిర్వహణలోనే ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. స్పందించిన ప్రయాణికులు, కండెక్టర్ బీఎన్ కండ్రిగ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందించడంతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు శ్రీకాళహస్తి నుంచి ప్రయాణికులతో తిరువళ్లూరుకు బయలుదేరింది. మార్గమధ్యంలోని అరిగిలకండ్రిగ గ్రామం వద్ద కేటీరోడ్డుపై బస్సు నడుపుతుండగా డ్రైవర్ అమ్ముల్‌రాజ్ అకస్మాత్తుగా చాతినొప్పి రావడంతో అస్వస్తతతకు గురి అయ్యాడు. డ్రైవర్ గుండెనొప్పిగా ఉందని కండక్టర్‌కు చెప్పారు. దీంతో కండక్టర్ హూటహూటిన బస్సును నడుపుకుంటూ బుచ్చినాయుడుకండ్రిగ పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. పీహెచ్‌సీలోని వైద్యులు మురళీరెడ్డి, ఉదయ్‌లు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ అమ్ముల్‌రాజ్ పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది.
ప్రమాదవశాత్తు భవన నిర్మాణ కార్మికుడి దుర్మరణం
చంద్రగిరి: ప్రమాదవశాత్తు భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన వేదాంతపురంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రేణిగుంట భగత్‌సింగ్ కాలనీకు చెందిన వీరేష్(35), వేదాతంపురంలోని ఓ భవన నిర్మాణ పనులకు వెళ్లాడు. పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న మట్టిగుట్ట ఒక్కసారిగా కుప్పకూలి వీరేష్‌పై పడింది. ఈ ప్రమాదంలో వీరేష్ మట్టిగుట్టలో కూరుకుపోయాడు. తోటి కార్మికులు కేకలు వేయడంతో, జేసీబీ సాయంతో వీరేష్‌ను బయటకు తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న కార్మిక సంఘం నేతలు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబానికి భవన నిర్మాణ కాంట్రాక్టర్ రూ.25 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ముగిసిన ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు
తిరుపతి తుడా: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ –2026 పోలింగ్ ప్రక్రియ సోమవారం ముగిసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికలను ఉదయం 8 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా నిర్వహించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత వైద్యుల సంఘం ఎన్నికలను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయిన వైద్యులు (ప్రభుత్వ, ప్రైవేటు) మొత్తం సుమారు 85 వేల మంది ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో 4 ప్యానెళ్ల పోటీ చేశాయి. 84 మంది వైద్యులు ఎన్ని కల్లో పోటీకి దిగారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు వైద్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
గుండెపోటుతో
ప్రయాణికుడి మృతి
చంద్రగిరి:గుండె పోటుతో ప్రయాణికుడు మృతి చెందిన ఘటన సోమవారం ఐతేపల్లి సమీపంలో చో టు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బెంగళూ రు సమీపంలోని హసన్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్(48) విశాఖప ట్నంలోని ఓ హోటల్‌లో వంట కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం విశాఖపట్నం నుంచి బెంగళూరుకు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయల్దేరాడు. ఐతేపల్లి వద్ద వెళుతున్న సమయంలో చంద్రశేఖర్ ఫోన్ రింగ్ అయ్యింది. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తోటి ప్రయాణికులు చంద్రశేఖర్‌ను వద్దకు వెళ్లి పరిశీలించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించి పోలీసుల కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చే రుకున్న ఎస్‌ఐ ప్రవళిక మృతదేహాన్ని పరిశీలించి, చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సాయంత్రం మృతదేహాన్ని బంధువులకు అప్పగించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేటు బస్సు డ్రైవర్‌కు గుండెపోటు
ప్రైవేటు బస్సు డ్రైవర్‌కు గుండెపోటు
ప్రైవేటు బస్సు డ్రైవర్‌కు గుండెపోటు


