స్వామి అమ్మవార్లకు వస్త్రాల బహూకరణ | - | Sakshi
Sakshi News home page

స్వామి అమ్మవార్లకు వస్త్రాల బహూకరణ

Feb 10 2026 8:10 AM | Updated on Feb 10 2026 8:10 AM

స్వామ

స్వామి అమ్మవార్లకు వస్త్రాల బహూకరణ

శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారికి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అలంకరించేందుకు చైన్నెకు చెందిన దొరై నాగరాజన్‌ అనే వ్యాపారవేత్త సోమవారం పట్టువస్త్రాలను అందజేశారు. వీటిని ఆలయ ఈఓ బా పిరెడ్డి స్వీకరించారు. దాతకు కృతజ్ఞతలు తెలిపారు. స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చే శారు. వేదపండితులు వారిని ఆశీర్వదించి, స్వా మి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు.

శ్రీసిటీని సందర్శించిన

ఎస్‌పీఎంజీ బృందం

శ్రీసిటీ (వరదయ్యపాళెం): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ (ఎస్‌పీఎంజీ) అధికారుల బృందం సోమవారం శ్రీసిటీని సందర్శించి, కీలక పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించింది. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య ప్రాజెక్టుల సమయానుకూల అమలును పర్యవేక్షించడం, వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ గ్రూప్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎస్‌పీఎంజీ బృంద సభ్యుడు హర్షద్‌ పోలాకి నేతృత్వంలో శ్రీసిటీలో పర్యటించి, ప్రధాన ప్రాజెక్టుల స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించారు. శ్రీసిటీలోని అక్సెలెంట్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌, సమీపంలోని అపోలో టైర్స్‌ పరిశ్రమల నిర్మాణాల పురోగతిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ ఎస్‌పీఎంజీ చేపడుతున్న ఈ తరహా సమీక్షలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.

స్వామి అమ్మవార్లకు  వస్త్రాల బహూకరణ 1
1/1

స్వామి అమ్మవార్లకు వస్త్రాల బహూకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement