సోమవారం ప్రజా సేవలు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

సోమవారం ప్రజా సేవలు బంద్‌

Feb 10 2026 8:10 AM | Updated on Feb 10 2026 8:10 AM

సోమవారం ప్రజా సేవలు బంద్‌

సోమవారం ప్రజా సేవలు బంద్‌

తిరుపతిఅర్బన్‌: సీఎం చంద్రబాబు 2047 విజన్‌ స మీక్ష అంటూ జిల్లాలోని ఉద్యోగులందరూ వర్చువల్‌ పద్ధతిలో హాజరుకావడంతో సోమవారం ప్రజా సేవ లు బంద్‌ అయ్యాయి. సోమవారం జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో అన్ని విభాగాలకు చెందిన హెచ్‌ఓడీలు హాజరయ్యారు. అలాగే ఆర్డీఓ ఆధ్వర్యంలో ఆ యా రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అధికారులు పాల్గొ న్నారు. తహసీల్దార్‌ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు సమీక్షలో ఉన్నారు. గ్రామ సచివాలయ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమీక్షలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా సీఎం స మీక్షతోనే డ్యూటీలను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేశారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement