చౌకదుకాణాల్లో నూనె ఊసేలేదు
పేదోడి సూపర్‌మార్కెట్‌గా పిలుస్తున్న చౌకదుకాణాల్లో నూనె విక్రయాల ఊసేలేకుండా పోయింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంతో ప్రతి నెలా క్రమం తప్పకుండా బియ్యంతోపాటు నూనె, కందిపప్పు ఇచ్చేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో 20 నెలలుగా కేవలం బియ్యంతో సరిపెట్టేస్తున్నారు. అరకొర చక్కర ఇస్తున్నారు. కందిపప్పు, నూనె ధరలు పెరుగుతున్నాయని, రాయితీతో ఇవ్వలేమంటూ చేతులు దులుపుకున్నారు. దీంతో పేదలు నూనె, కందిపప్పును అధిక ధరలు చెల్లించి మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి చోటుచేసుకుంది. – నీలా, గృహిణి, తిరుపతి
నెలనెలా వేరుశనగ నూనె ధర
పెరిగిపోతుంది
వేరుశనగ నూనె దశాబద్దాలుగా వాడుతున్నాం. అయితే ప్రతి వారం వేరుశనగ పప్పులు, నూనె ధరలు పెంచేస్తున్నారు. ఎందుకంటూ ప్రశ్నిస్తే జిల్లాలో వేరుశనగ పంట సాగుచేయడం లేదని, దాంతో ఉత్పత్తులు లేవంటున్నారు. మరోవైపు వేరుశనగ దిగుమతులు తగ్గాయంటున్నారు. వాటితో పేదోడికి ఎమీటీ సంబంధం. మాకు రూపాయి తగ్గిస్తే సంతోషపడతాం. రూపాయి పెంచితే బాధపడుతాం. ఈ ప్రభుత్వంలో పేదోడి జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది.
– మొగిలి ధనలక్ష్మి, గృహిణి చిట్టమూరు
చౌకదుకాణాల్లో నూనె ఊసేలేదు


