
బెంగళూరుకు చెందిన అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ దేశీయ మార్కెట్లో.. కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడమే కాకుండా, తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఒక లేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించింది. దీంతో సంస్థ 26 నగరాల్లో తన పాదముద్రను బలోపేతం చేసింది.
తిరుపతిలో ప్రారంభమైన అల్ట్రావయోలెట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లో.. సేల్స్, సర్వీస్ వంటి వాటితో పాటు విడిభాగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎక్స్-47 క్రాస్ఓవర్, ఎఫ్77, ఎఫ్77 సూపర్ స్ట్రీట్ బైకులు ఉన్నాయి. ఈ కొత్త సెంటర్ ప్రారంభోత్సవం సమయంలో సీఈఓ నారాయణ్ మాట్లాడుతూ.. ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ద్వారా కొత్త బైకులను కొనుగోలు చేయవచ్చు. టెస్ట్ రైడ్‌లు, సర్వీస్ వంటివి కూడా పొందవచ్చని అన్నారు.