
సాక్షి,తిరుపతి: జిల్లాలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ నాయుడుపేట ఎంఆర్వోకు (MRO) దేహశుద్ధి జరిగింది.
గత కొద్ది రోజులుగా మహిళా వీఆర్‌వ్వోను (VRO).. ఎంఆర్వో లైగింకంగా వేధిస్తున్నాడు. ‘మీ ఇంటికి వస్తా.. కోడి కూర వండిపెడతావా? అడిగింది ఇస్తావా?’ అని మెసేజ్‌లు పెట్టాడు. ఆపై ఆమె ఇంటికే వెళ్లాడు. బరితెగించిన ఎంఆర్వో..దుస్తులు విప్పి తన కోరిక తీర్చాలంటూ మహిళా వీఆర్వోను వేధించాడు. అయితే అప్రమత్తమైన బాధితురాలి కుటుంబసభ్యులు.. తహసీల్దార్ పట్టుకుని మరీ దేశశుద్ధి చేశారు.