ప్రశ్నిస్తే.. నాలుక మందం అంట: భూమన అభినయ్ | Bhumana Abhinay Reddy Slams CBN Over Urea Shortage In Andhra Pradesh, More Details Inside | Sakshi
Sakshi News home page

Bhumana Abhinay: ప్రశ్నిస్తే.. నాలుక మందం అంట

Sep 5 2025 11:36 AM | Updated on Sep 5 2025 12:47 PM

Bhumana Abhinay Reddy Slams CBN Over Urea Shortage

సాక్షి తిరుపతి: అధికారంలోకి రావడానికి అలవికాని హామీలు ఇచ్చే చంద్రబాబు.. ఇప్పుడు కనీసం రైతులు పడుతున్న ఇబ్బందులను కూడా పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ తిరుపతి ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కూటమి సర్కార్‌ తీరును ఎండగట్టారు.

‘‘హమీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటిని గాలికొదిలేశారు.  సూపర్ సిక్స్ హామీలు గురించి అడిగితే అన్ని అమలు చేసేశామని అంటున్నారు. రైతు భరోసాను అన్నదాత సుఖీభవ పేరుతో మార్చారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సాయం రూ. 7 వేలు మాత్రమే అందించారు. 

గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్న రైతులు.. ఇప్పుడు యూరియా కొరతతోనూ అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నారు. యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో బ్లాక్‌ మార్కెట్‌లో యూరియాను విచ్చలవిడిగా అమ్మేసుకుంటున్నారు. ప్రశ్నిస్తే నాలుక మందం అంటారు.  చంద్రబాబు దీనంతటికి సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి యురియా అందుబాటులో తెవాలి. లేకుంటే తగిన బుద్ధి చెప్తాం.. 

రైతుల కోసం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ డివిజన్‌ అర్డీఓ కార్యాలయంలో వినతి సమర్పిస్తాం. తిరుపతి పరిధిలో అన్నమయ్య సర్కిల్ నుండి ర్యాలీ చేపడతాం అని భూమన తెలిపారు.  

కిరణ్‌ రాయల్‌ తాజాగా ప్రెస్‌మీట్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన ఆరోపణలపైనా అభియన్‌ తీవ్రంగా స్పందించారు. అసలు కిరణ్ రాయల్ ఏ పార్టీనో ముందుగా చెప్పాలని ప్రశ్నించారు. ‘‘కిరణ్ రాయల్ ను గతంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ చెప్పింది. రాజకీయాలలో దిగజారి  మాట్లాడటం సబబు కాదు’’ అభినయ్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement