కేసులతో వేధింపులు.. కూటమిని ప్రశ్నించడం ఆపేదిలేదు: భూమన | AP Govt Creating False Liquor Scam to Target YSRCP Leaders: Bhumana Karunakar Reddy | Sakshi
Sakshi News home page

కేసులతో వేధింపులు.. కూటమిని ప్రశ్నించడం ఆపేదిలేదు: భూమన

Aug 29 2025 1:16 PM | Updated on Aug 29 2025 1:37 PM

YSRCP Leaders Serious Comments On CBN Govt

సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ పోలీసులు 15 నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు  కాపాడాలనే లక్ష్యాన్ని మరిచిపోయారని అన్నారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో లేని లిక్కర్‌ స్కాంను సృష్టించి.. వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్‌ చేసిందని మండిపడ్డారు.

రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్‌లో మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మాజీమంత్రి ధర్మాన కృష్ణ దాస్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కలిశారు. అనంతరం, భూమన మీడియాతో మాట్లాడుతూ.. ఏదో ఒక నెపంతో వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను కేసులతో వేధిస్తున్నారు. మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా వైఎస్‌ జగన్ నైతికతను దెబ్బతీయ వచ్చని భావిస్తున్నారు. అందులో భాగంగానే లేని లిక్కర్ స్కాంను సృష్టించి వైఎస్సార్‌సీపీ నేతలను, అధికారులను అరెస్టు చేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రశ్నించడంలో ఏమాత్రం వెనకడుగు వేయం. మిథున్ రెడ్డి మానసికంగా ధైర్యంగా ఉన్నారు. కార్యకర్తలందరినీ జైల్లో పెట్టినా ఏమాత్రం భయపడేది లేదు. ఎన్ని రోజులు జైల్లో పెట్టిన మా మనో నిబ్బరాన్ని దెబ్బ తీయలేరు’ అని అన్నారు.

మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని జైలు పాలు చేస్తోంది. మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అన్యాయంగా జైలుకు పంపించింది. మిథున్ రెడ్డి కూడా ధైర్యంగా ఉన్నారు. న్యాయం కోసం పోరాడుదామని చెప్పారు’ అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement