బెడిసి కొడుతున్న బాబు బేతాళ కుట్రలు | Chandrababu conspiracy failed in illegal case on liquor policy during YSRCP govt | Sakshi
Sakshi News home page

బెడిసి కొడుతున్న బాబు బేతాళ కుట్రలు

Sep 30 2025 5:58 AM | Updated on Sep 30 2025 5:58 AM

Chandrababu conspiracy failed in illegal case on liquor policy during YSRCP govt

ఎలాంటి ఆధారాలు లేక ఒక్కొక్కటిగా వీగిపోతున్న వైనం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానం పారదర్శకంగా ఉండటం వల్లే తప్పుడు కేసు 

అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్‌ కుతంత్రం 

బెదిరింపులు, ప్రలోభాలకు లొంగక పోవడంతో అక్రమ అరెస్టులతో కక్ష సాధింపు 

కుటుంబ సభ్యులకు సైతం వేధింపులు.. ఇళ్లలో సోదాల పేరుతో హైడ్రామా 

లేని కుంభకోణాన్ని ఉన్నట్లు చూపేందుకు సాక్ష్యాల కోసం విఫల యత్నం 

ఇంత చేసినా ఒక్క ఆధారం చూపలేక చేతులెత్తేసిన సిట్‌ 

ఫలితంగా ఇప్పటికే ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు.. తాజాగా ఎంపీ మిథున్‌కు బెయిల్‌ మంజూరు

సాక్షి, అమరావతి : చంద్రబాబు బేతాళ కుట్రలు ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు కుట్ర విచ్చిన్నమవుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పన్నిన కుతంత్రం క్రమంగా వీగిపోతోంది. ఈ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్‌ కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పలకు ఈ నెల 6న బెయిల్‌ మంజూరు కాగా... తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్‌ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకే  పాల్పడుతోందన్నది తద్వారా స్పష్టమైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పారదర్శకంగా అమలైందని ఎక్సైజ్‌ శాఖ నివేదికలే వెల్లడిస్తున్నాయి. అందుకే చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ ద్వారా కుట్రకు తెరతీసింది. ఈ అక్రమ కేసులో లేని ఆధారాలు సృష్టించేందుకు వేధింపులనే అస్త్రంగా చేసుకుంది. సిట్‌ న్యాయస్థానానికి సమ ర్పించిన చార్జ్‌షిట్‌లో పేర్కొన్న వాంగ్మూలాన్ని కూడా వారు బెదిరించి, వేధించి నమోదు చేసినవే కావడం గమనార్హం.

బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలాన్నే సిట్‌ ఈ అక్రమ కేసుకు ప్రధాన ఆధారంగా చేసుకుంది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదుకు నిరాకరించిన ఆయన సిట్‌ బెదిరింపులకు వ్యతిరేకంగా మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డెప్యుటేషన్‌ ముగిసినా రిలీవ్‌ చేయకుండా అడ్డుకుంది. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది. తుదకు సిట్‌ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్‌ చేసి కేంద్ర సర్విసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచి్చంది. అదే రీతిలో బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది.   

అబద్ధపు వాంగ్మూలాల కోసం బెదిరింపులు 
ఈ కేసులో వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్, అనూషలను అప్రూవర్లుగా మార్చాలని సిట్‌ యత్నించడం గమనార్హం. ముందుగా అరెస్టు అయితేనే అప్రూవర్లుగా మారేందుకు పిటిషన్‌ను పరిశీలిస్తామని న్యాయస్థానం చెప్పడంతో ఆ ముగ్గురూ వెనక్కి తగ్గాల్సి వచి్చంది.    

 అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని సిట్‌ డిస్టిలరీల ప్రతినిధులను వేధించింది. వృద్ధులని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ తీసుకువచ్చి వేధించడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారిని హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్‌ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచి్చంది.  

ఈ కేసులో అరెస్టు అయిన రాజ్‌ కేసిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి విచారణలో చెప్పని విషయాలు చెప్పినట్టుగా రిమాండ్‌ నివేదికలో పేర్కొనడం సిట్‌ కుట్రను బట్టబయలు చేసింది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి, మదన్‌ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్ర స్థాయిలో వేధించారు. బెంబేలెత్తిన గిరి.. సిట్‌ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్‌ రెడ్డిపై సిట్‌ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  

రాజ్‌ కేసిరెడ్డి భార్య భాగస్వామిగా ఉన్న∙ఇంజినీరింగ్‌ కాలేజీలో రూ.11 కోట్లు స్వా«దీనం చేసుకుని, ఆ డబ్బు కేసిరెడ్డిదేనని సిట్‌ మరో కట్టు కథ అల్లింది. కాగా, ఆ నగదు తనది కాదని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయిండంతో సిట్‌ కుట్ర కథ అడ్డం తిరిగింది. ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్‌ నంబర్ల ఆధారంగా ఎప్పుడు ఏ బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేశారో ఆర్‌బీఐ ద్వారా విచారించాలని ఆయన న్యాయ­స్థానాన్ని కోరడంతో సిట్‌ తోక ముడిచింది.  

అన్నీ అక్రమ అరెస్టులే.. 
  ఈ అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్‌ బరితెగించి వ్యవహరించింది. అక్రమ అరెస్టులతో వేధింపులకు పాల్పడింది. అప్రూవర్‌గా మారి తాము చెప్పినట్టు వాంగ్మూలం ఇవ్వాలని రాజ్‌ కేసిరెడ్డిని వేధించారు. అందుకు ఆయన తిరస్కరించడంతోనే అరెస్టు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్‌ అక్రమంగా అరెస్టు చేసింది.  

అసలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో సంబంధం లేని ప్రపంచ దిగ్గజ సిమెంట్‌ కంపెనీ వికాట్‌ కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేయడం సిట్‌ కుట్రకు పరాకాష్ట. సిట్‌ ఆయనతో బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించింది. ఆయన ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లడంతో సిట్‌ కుతంత్రం బెడిసి కొట్టింది.  

మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని ఎంపీ మిథున్‌ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్‌ పదవి ఇవ్వడంతోపాటు రూ.2 కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్‌ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్నేహితుడు వెంకటేశ్‌నాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతో ఈ కేసులో వెంకటేశ్‌నాయుడును కూడా అరెస్టు చేశారు.   
దు్రష్పచార కుతంత్రం 
అక్రమ కేసులో దర్యాప్తు పేరిట సిట్‌ కుతంత్రాలు అడ్డూ అదుపు లేకుండా సాగాయి. ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్‌ అనిల్‌ రెడ్డి కార్యాలయాల్లో సిట్‌ సోదాల పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. దీంతో ఆయన కంపెనీల్లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి భారతి డైరెక్టర్‌గా వ్యవహరించారని ఎల్లో మీడియా దు్రష్పచారం చేసింది. వాస్తవానికి వైఎస్‌ అనిల్‌ రెడ్డి మాతృమూర్తి వైఎస్‌ భారతి గతంలో ఆ కంపెనీల్లో డైరెక్టర్‌గా వ్యవహరించారు. 

⇒  హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, వ్యాపారి నర్రెడ్డి సునీల్‌ రెడ్డి నివాసాల్లో తనిఖీల పేరిట సిట్‌ రాద్ధాంతం చేసింది. ఆ సమయంలో ఓ ప్రైవేటు వాహనంలో కొన్ని సందేహాస్పద పత్రాలను ఆయన నివాసంలో చేర్చేందుకు సిట్‌ యత్నించడం గమనార్హం. ఆ వాహనంలో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఉండటం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. అంటే తనిఖీల పేరుతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు సిట్‌ యత్నించిందన్నది బహిర్గతమైంది.  

  సిట్‌ దాఖలు చేసిన మొదటి చార్జ్‌షిట్, అనుబంధ చార్జ్‌షిట్లను పరిశీలించిన న్యాయస్థానమే వాటి చట్టబద్ధతను ప్రశి్నంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయస్థానం లేవనెత్తిన అభ్యంతరాలపై సిట్‌ సమాధానం చెప్పలేకపోయింది. అందుకే సీఆర్‌సీపీ సెక్షన్‌ 167(2) ప్రకారం ఈ కేసులో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డి, రిటైర్డ్‌ అధికారి కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్‌ కంపెనీ ఎండీ బాలాజీ గోవిందప్పలకు ఈ నెల 6న, ఎంపీ మిథున్‌ రెడ్డికి సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. తద్వారా సిట్‌ అల్లిన కట్టుకథల కుట్రలు ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.  

నాడు మద్యం విధానం పారదర్శకం
 అసలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్‌ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దశల వారీగా మద్య నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసింది.  

అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ 4,380 ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశ పెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశల వారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది. 

 చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పరి్మట్‌ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43 వేల బెల్ట్‌ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకు ముందు ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. మొత్తం 20 డిస్టిలరీలను బెవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్‌ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. 

 ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. తద్వారా డిస్టిలరీలకు లాభాలు తగ్గిపోయాయి. అలాంటప్పుడు డిస్టిలరీలు ప్రభుత్వ పెద్దలకు ఎందుకు కమీషన్లు ఇస్తాయి? ఇవ్వనే ఇవ్వవు. కాబట్టే అవినీతి లేని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్‌ అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలనే ఆధారంగా చేసుకుంది. ఇప్పుడవన్నీ ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement