
సాక్షి, తిరుపతి: చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్టుకు పదిరూపాయలు రాలేదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవాణి ట్రస్టు విషయంలో చంద్రబాబు గతంలో విషం చిమ్మారు.. ఇప్పుడు అవే డబ్బు మీ ఇంటికి వస్తున్నాయా? అని ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అని కామెంట్స్ చేశారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘శ్రీవాణి ట్రస్ట్ అవినీతి అంటూ, ట్రస్ట్ డబ్బులు తాడేపల్లికి వెళ్ళాయి అంటూ విష ప్రచారం చేస్తున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్‌కు పనులు చేయడం మాత్రమే తెలుసు. దేశం అంతా దేవాలయాలు నిర్మాణం చేయాలని, ప్రత్యేక దర్శనం ద్వారా దర్శనాలు ఇవ్వాలని చూశారు. చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్టుకు పది రూపాయలు కూడా రాలేదు. వైఎస్ జగన్ పాలనలో శ్రీవాణి 2019 నుంచి ఇప్పటి వరకు 2038 కోట్లు జమ అయ్యాయి. అది జగన్ వల్లే జరిగింది.
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశం అంతా ఆలయాలు నిర్మించండి అని చంద్రబాబు ఇప్పుడు చెప్తున్నారు. 3500 ఆలయాలు వైఎస్ జగన్ పాలనలో పూర్తి అయ్యాయి. అందులో 300 ఆలయాలు జీవోద్ధరణ చేయించారు. ఇప్పుడు పాలన ఉండి ఉంటే దేశ వ్యాప్తంగా లక్ష గుళ్లు నిర్మాణం జరిగి ఉండేది. మరి.. ఇప్పుడు శ్రీవాణి నిధులు అన్ని చంద్రబాబు ఇంటికి వస్తున్నాయా?. శ్రీనగర్, ముంబై, భువనేశ్వర్, విశాఖలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మాణం చేశాం.
నాడు శ్రీవాణి ట్రస్టుపై విషం చిమ్మారు.. ఇప్పుడు అదే ట్రస్ట్ గురించి మీరు పొగుడుతున్నారు. చంద్రబాబు.. మీ మాదిరిగా వైఎస్ జగన్ రంగనాయకుల మండపం గురించి చెప్పుకోలేదు. గుడి లోపల ఏఐ టెక్నాలజీ వాడటం ఆగమ శాస్త్రం విరుద్ధం. మీరు చెప్పినట్లు చేస్తే సంతృప్తికర దర్శనం అనేది దుర్లభం. అమరావతి గ్రాఫిక్స్ మాదిరే ఆదిదేవుడిని గ్రాఫిక్స్‌లో చూపించాలని చెప్పదలుచుకున్నారా?. వైఎస్ జగన్ చేసిన మంచిని అంగీకరించండి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఆయన కార్యాలయంలోనే బూతులు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. శ్రీవాణి ట్రస్ట్ రాగానే రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తి టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు.

20 ఏళ్ల ముందే బాలకృష్ణకు పిచ్చి పట్టింది అని ఆయన బావగారు పుస్తకంలో రాశారు. ఆయన బావగారు దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాసుకొచ్చారు. బాలకృష్ణకు కృతజ్ఞత ఉంటుంది అనుకున్నా. దివంగత నేత వైఎస్సార్ ఆనాడు బాలకృష్ణకు సాయం చేశారు. బాలకృష్ణ తప్పతాగి మాట్లాడారు అని ఘాటు విమర్శలు చేశారు.