కాణిపాకం ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ది క్షేత్రానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ఐఎస్‌ఓ సర్టిఫికెట్ వరించింది. ఎమ్మెల్యే మురళీమోహన్, దేవస్థానం చైర్మన్ మణి నా యుడు, ఈవో పెంచల కిషోర్, సీఈవో శివయ్య బుధవారం ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద సర్టిఫికెట్లను అందజేశారు. ఆలయంలో ఆలయ మేనేజ్మెంట్ సిస్టం, క్యూలైన్లు, పరిశుభ్రత, ప్రసాదం తయారీ, అన్నదానం, పడితరం స్టోర్, నిర్వహణ తదితర వాటిలో నాణ్యతకు మార్క్‌గా ఈ సర్టిఫికెట్‌ను అందజేస్తున్నటు సంస్థ వెల్లడించింది. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సభ్యులున్నారు.
డేటా సేకరణలో అలసత్వం వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : సంజీవిని డిజిటల్ నర్స్ సెంటర్ ప్రోగ్రాంకు సంబంధించిన డేటా సేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం క్షేత్రస్థాయి వైద్యశాఖ అధికారులతో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్న వారికి వైద్య సేవలు అందించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలకు అభా ఐడీ క్రియేట్ చేసి, సెల్ నంబర్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఈ కా న్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
కాణిపాకం ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్
కాణిపాకం ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్


