అర్ధరాత్రి దాకా మద్యం అమ్మకాలు
చిత్తూరు అర్బన్ : జనవరి ఒకటో తేదీని పురస్కరించుకుని టీడీపీ ప్రభుత్వం మందు బాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రజల సంక్షేమం విషయం పక్కనపెట్టి.. మద్యాన్ని ఆదాయ వనరుగా గుర్తించింది. జిల్లాలోని 114 మద్యం దుకాణాలు, 8 మద్యం బార్లలో న్యూ ఇయర్ పేరిట అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధ, గురువారం మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు, మద్యం బార్లు రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచడానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.


