కొత్త ఏడాదిలోనైనా గతం కంటే మెరుగ్గా ఉండాలని జనం కోటి ఆశ
కొత్త సంవత్సరంపై ఎన్నో ఆకాంక్షలు 2025కు వీడ్కోలు..కొత్త ఏడాదికి స్వాగతం ఆశల పల్లకిలో ప్రజానీకం
కోటి ఆశలు
కాణిపాకం : కాలగర్భంలో 2025 కలిసిపోయింది. గత కాలం పంచిన చేదు అనుభవాలను ప్రజలు దిగమింగుతున్నారు. 2026కు ప్రజలు ఆనందోత్సాహాలతో ప్రజలు స్వాగతం పలికారు. కొత్త ఏడాది అయినా ఆశలను ఆకాంక్షలను నెరవేర్చేదిగా ఉండాలని కోరుకుంటున్నారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు ఉండాలని, మెరుగైన వైద్యం అందాలని, వ్యాధులు ధరి చేరకుండా ఆరోగ్యం బాగుండాలని , వికలాంగుల కష్టాలు తొలగాలని, ఉన్నత చదువుల డోకా లేకుండా చూడాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కాలని, మహిళలకు రక్షణ, ప్రశాంతంగా గడిపేలా... బతుకులు మారాలని ఆశ పడుతున్నారు. గత కష్టాలు మళ్లీ ఈ కొత్త సంవత్సరంలో ఉండకూడదని ,ఆయా వర్గాలు అవకాశం వస్తే అందిపుచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. పలువురు తమ ఆశలు..ఆంక్షాలను సాక్షితో పంచుకున్నారు.


