అనుమతుల్లేని రూ.17.50 లక్షల మందులు నిషేధం
పుంగనూరు : పట్టణంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విక్రయిస్తున్న మందుల విలువ రూ.17.50 లక్షలు కలిగిన వాటిపై విక్రయాలు నిలిపివేసినట్లు జిల్లా ప్రత్యేక అధికారులు సాయిరెడ్డి, సునీల్‌కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని పలు మందులు, విత్తనాలు విక్రయించే దుకాణాదారులపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి అనుమతి పత్రం తీసుకుని మందులు విక్రయించాలి. ఇందుకు విరుద్ధంగా 480 లీటర్లు వివిధ కంపెనీల వద్ద కొనుగోలు చేసినవి అనుమతి లేకుండా నిల్వ చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి విక్రయాలను నిషేధించారు. అనుమతి పొందకుండా మందులు విక్రయిస్తే షాపులు సీజ్ చేస్తామని వారు హెచ్చరించారు. తనిఖీలో ఏడీ శివకుమార్, ఏవో రాధా పాల్గొన్నారు.


