‘నిరుపేదల భూములను లాక్కుంటున్నారు’ | YSRCP Leader Bhumana Karunakar Reddy Takes On AP Govt | Sakshi
Sakshi News home page

‘నిరుపేదల భూములను లాక్కుంటున్నారు’

Jun 26 2026 8:57 PM | Updated on Jun 26 2026 8:59 PM

YSRCP Leader Bhumana Karunakar Reddy Takes On AP Govt

తిరుపతి: దామినేడులో రూ. 600 కోట్లు విలువ చేసే 22 ఎకరాల భూమి కేటాయింపుపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.  కూటమి ప్రభుత్వం పేదల భూములను కార్పోరేట్‌ సంస్థలకు కారు చౌకగా రూ. 25 కోట్లకే  కట్టబెడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీహోల్డ్‌ పేరుతో ప్రభుత్వ భూముల బదిలీ జరిగిందని భూమన విమర్శించారు. 

దామినేడులో స్టార్ హోటళ్లు, స్పా, రిసార్ట్‌లకు మార్గం సుగమం చేసేందుకే కూటమి ప్రభుత్వం ఇలా పేదల భూములను కారు చౌకగా కార్పోరేట్‌ సంస్థలకు కట్టబెడుతుందని ఆరోపించారు. నిరుపేదల భూములను లాక్కుంటున్నారని, బాబు పాలనలో పేదల హక్కులకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. చంద్రగిరిలో భూకబ్జాలు పెరిగిపోయాయని, బాధితుల తరఫున న్యాయపోరాటం చేస్తామని భూమన హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement