
సాక్షి,తిరుపతి: బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుంచి అన్నీ వివాదాలే నెలకొంటున్నాయని.. తప్పులను ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.
బుధవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఛైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనునిత్యం ఏదో ఒకటి అపచారం జరుగుతున్నాయి. ప్రశ్నించి మాపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. చంద్ర గ్రహణం రోజున మహాద్వారం మూసి వేసిన తర్వాత ఇత్తడి గ్రిల్ గేటు తాళాలు వేస్తున్నారు. టీవీ5 శ్రీవారి ఆలయమా..టీవీ5 కార్యాలయమా?.
బీఆర్ నాయుడు సైన్యంలో ఒకరు తాళం వేస్తున్నారు. ఇది దేనికి సంకేతం.ఇది చాలా తప్పిదం. బోర్డు సభ్యుడు మహాద్వారం వద్ద పెద్ద గొడవ జరిగింది.మీ సైన్యంలో ముఖ్యుడు శ్రీవారి ఆలయంలో కులశేఖర పడి వద్ద ఆలయ డిప్యూటి ఈవో పని చేస్తున్నాడనే ఫిర్యాదులందాయి. టీడీపీ కార్యకర్తగా టివీ5 ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బీఆర్ నాయుడు ఉన్నారనే ధైర్యంతో ఈ బరితెగింపు బయటపడింది. ఆలయం లోపల మరోముఖ్యుడు చేస్తున్నవి బయటకు రాలేదు.
శ్రీవారి కల్యాణాలు జరపాలని తెలుగు అసోసియేషన్ జర్మనీ వాళ్ళు తరపున రవి కుమార్ వేమూరి కోరారు. సెప్టెంబర్ ఆరు నుంచి 16 చోట్ల శ్రీవారి కల్యాణాలు జరపాలని కోరారు. బీఆర్ నాయుడు తన బలంతో ఒకే చేశారు..ప్రొసీడింగ్స్ ఇచ్చారు. శ్రీవారి కల్యాణాలు మొట్ట మొదటిగా మా హయంలో సూళ్లూరుపేట దళితవాడలో ప్రారంభించాం. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా , ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి.
శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవాలు హాంబర్గ్‌లో కళ్యాణోత్సవాలుకు టికెట్ ధర 116 యూరోలు , జంటగా కల్యాణోత్సవం 81 యూరోలు, విశేష కళ్యాణానికి 515 యూరోలు పేరుతో టికెట్లు పెట్టడం జరిగింది.
టీడీపీ ఎన్నికల ఫండ్స్ ఇచ్చిన వారికి సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చారా..? టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడు అనుమతితో జరుగుతోంది. ధనవంతులు ఇళ్లలో లక్ష్మి పూజలు మీ అనుగ్రహంతోనే జరుగుతున్నాయి. మీరు చేసిన బ్లాక్ మెయిల్ చేసినవి ఒక్కొక్కటి బయటకు తీస్తున్నాం. మీరు చేస్తున్న అవినీతిపై మా పోరాటం కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు.
