అది హిందువుల దురదృష్టం.. BR నాయుడికి భూమన కౌంటర్‌ | Bhumana Karunakar Reddy Fires On TTD Chairman BR Naidu Over TTD Lands, Watch Video For More Details | Sakshi
Sakshi News home page

అది హిందువుల దురదృష్టం.. BR నాయుడికి భూమన కౌంటర్‌

Aug 28 2025 11:29 AM | Updated on Aug 28 2025 12:50 PM

Bhumana Wait BR Naidu Over TTD Lands

తిరుపతి, సాక్షి: అత్యంత విలువైన తిరుమల తిరుపతి దేవస్థానం భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మరోసారి నిలదీశారు. గురువారం తిరుపతిలో మీడియాతో భూమన మాట్లాడారు. 

టీటీడీ భూములను టూరిజం శాఖకు ఎందుకు బదలాయిస్తున్నారు?. అత్యంత విలువైన భూములను ఎందుకు ఇస్తున్నారు?.  నా ప్రశ్నలకు బీఆర్‌ నాయుడు ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు. పైగా అడినందుకు బూతులు తిడుతున్నారు. బీఆర్‌ నాయుడి వ్యాఖ్యలు దారుణంగా ఉంటున్నాయి. అలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్‌ కావడం హిందువుల దురదృష్టం అని భూమన అన్నారు. అలాగే తనపై బీఆర్‌ నాయుడు చేస్తున్న ఆరోపణలపైనా భూమన స్పందించారు. 

బీఆర్‌ నాయుడు.. తప్పుడు ప్రచారాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌. ఆయనో దోపిడీదారుడు.. పైరవీకారుడు. అలాంటి వ్యక్తి బెదిరింపులకు భయపడం. నాపై చేసే ఆరోపణలకు సీబీఐ విచారణకైనా సిద్ధం. జూబ్లీహిల్స్‌ సొసైటీలో బీఆర్‌ నాయుడు అనేక అక్రమాలు చేశారు. అతని అరాచకాలపై పోరాటం చేస్తూనే ఉంటాం అని భూమన అన్నారు. 

‘‘బీఆర్‌ నాయుడు టీటీడీ చైర్మన్‌ పదవి అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై నిరంతరం దూషణలకు దిగుతున్నారు. క్విడ్‌ప్రో కింద బీఆర్‌ నాయుడికి ఆ పదవి వచ్చింది. ఆ పదవి శాశ్వతం కాదనే విషయం బీఆర్‌ నాయుడు గుర్తుంచుకోవాలి’’ అని భూమన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement