
సాక్షి,తిరుపతి: టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు చేతకానితనం వల్ల తిరుమలలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని తిరుపతి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ భూమన అభినయ్‌రెడ్డి ఆరోపించారు. టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర రెడ్డిపై తిరుపతి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి అక్రమ కేసు నమోదైంది.
ఆ అక్రమ కేసుపై భూమా అభినయ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడు భూమన కరుణాకరరెడ్డిపై అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం పాలనలో వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. వరుస వైఫల్యాలకు కారణం విజిలెన్స్ అధికారుల వైఫల్యమే. మీ పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు చేతకానితనం వల్లే టీటీడీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. మీ తప్పుడు కేసులకు భయపడే వ్యక్తి కాదు భూమన కరుణాకర్‌రెడ్డి. మీ తప్పులు సవరించుకోవాలి, మీరు మాపై ఎదురుదాడి చేస్తే చూస్తూ ఊరుకోం. ప్రజా గొంతు నొక్కేప్రయత్నం చేస్తున్నారని’ ధ్వజమెత్తారు.