YSRCPలో నూతన నియామకాలు | Ysrcp Pac Members Appointed | Sakshi
Sakshi News home page

YSRCPలో నూతన నియామకాలు

Dec 17 2025 9:46 PM | Updated on Dec 17 2025 9:47 PM

Ysrcp Pac Members Appointed

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. PAC సభ్యులుగా వంగా గీత (పిఠాపురం), షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ (కదిరి) నియమితులయ్యారు.

కాగా, ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పలువురి నియామకం జరిగిన సంగతి తెలిసిందే. షేక్‌ గౌస్ మొహిద్దిన్ (విజయవాడ వెస్ట్), మీర్ హుస్సేన్ (విజయవాడ ఈస్ట్), కర్నాటి రాంబాబు (విజయవాడ వెస్ట్), మీర్జా సమీర్ అలీ బేగ్ (మార్కాపురం), ఆర్. శ్రీనివాసులురెడ్డి (పలమనేరు), కె.కృష్ణమూర్తిరెడ్డి (పలమనేరు), పోలు సుబ్బారెడ్డి (రాయచోటి), ఉపేంద్ర రెడ్డి (రాయచోటి), డి. ఉదయ్ కుమార్ (మదనపల్లె), వి.చలపతి (కోవూరు), గువ్వల శ్రీకాంత్ రెడ్డి (సింగనమల), డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి (తాడిపత్రి),  సుభాష్ చంద్రబోస్ (కర్నూలు), రఘునాథరెడ్డి (జమ్మలమడుగు), ఎస్. ప్రసాద్ రెడ్డి (కమలాపురం), పార్టీ ఎస్‌ఈసీ సభ్యునిగా ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి (రాయచోటి) నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement