చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని ఉపేక్షిస్తే ఎలా? | - | Sakshi
Sakshi News home page

చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని ఉపేక్షిస్తే ఎలా?

Feb 3 2026 7:37 AM | Updated on Feb 3 2026 7:37 AM

చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని ఉపేక్షిస్తే ఎలా?

చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని ఉపేక్షిస్తే ఎలా?

జనసేన అధికార ప్రతినిధి రజని ఫ్లెక్సీ ఘటనపై నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు కర్రలు చేత్తో పట్టుకుని తిరిగిన వారిపై చర్యలేవి? కొత్త సాంప్రదాయానికి తెర లేపొద్దు

సాక్షి ప్రతినిధి, గుంటూరు : చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారిని ఉపేక్షించడం సరికాదని, కర్రలు చేత్తో పట్టుకుని తిరుగుతూ దాడులు చేసిన వారిపై చర్యలు లేకపోతే ఎలా అని జనసేన అధికార ప్రతినిధి, న్యాయవాది కన్నా రజనీ ప్రశ్నించారు. గోరంట్లలో ఫ్లెక్సీ వద్ద జరిగిన ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె సోమవారం నల్లపాడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒక ఫ్లెక్సీ ఇన్ని గొడవలకు దారితీస్తుందని చూడగానే అనుకున్నాను. అది రెచ్చగొట్టే ధోరణితో ఉంది. సిట్‌, సీబీఐ కేసు విచారణ చేస్తుండగా ఇతనే నేరగాడంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మంచిది కాదన్నారు. రెచ్చగొట్టే ధోరణితోనే, కొట్టుకోవాలనే ధోరణితోనే ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారన్నారు. అది ఒక చోట కాకుండా, రాష్ట్రమంతా వేశారన్నారు. అది హేయమైన చర్య అంటూ వాళ్లు చింపేస్తారని మీకు తెలిసే, అప్పుడు తిరగబడాలని అనుకున్నారేమో తనకు తెలియదన్నారు. ఏది ఏమైనా కర్రలు పట్టుకునే సంప్రదాయం సాధారణ పౌరులకు లేదని, కర్రలు పట్టుకునే హక్కు కేవలం పోలీసులకే ఉందని అది కూడా చట్టాన్ని పరిరక్షించడానికే అని రజని పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద కర్రలు పట్టుకుని నిల్చోవడం, పక్కనే పోలీసులు ఉండటం చాలా ఆశ్చర్యమనిపించిందన్నారు. వెంటనే పోలీసులు వారి చేతుల్లో కర్రలు తీసుకుని ఉండాల్సింది. కానీ తీసుకోలేదు. ఈ రోజు కూడా సీఐని ఇదే అడిగానన్నారు. కర్రలు పట్టుకుని వారు నిల్చుంటే మీరు ఎందుకు ఉపేక్షించారంటే, అంబటి రాంబాబు కారులో కర్రలు ఉన్నాయంట అని సీఐ చెబుతున్నారు. అందుకనే వీరు కూడా కర్రలు పట్టుకుని నిల్చున్నారని సమర్థిస్తున్నారు. అసలు లా అండ్‌ ఆర్డర్‌ వాళ్ల చేతుల్లోకి తీసుకోవడానికి ఏం అధికారం ఉంది. వాళ్లు కర్రలు పట్టుకుని ఉంటే, మీరు పక్కన చోద్యం చూస్తున్నారా? చట్ట వ్యతిరేకం కదా అంటూ నిలదీశారు. ఇలాంటి కొత్త సాంప్రదాయానికి తెరలేపవద్దు. ఒకరికొకరు కొట్టుకుని చంపుకునే సంప్రదాయం వద్దు. కూటమి సర్కార్‌ను కష్టపడి అందరం కలిసి ఏర్పాటు చేశాం.

అది రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తారని, ఫ్లెక్సీలకు కాపలా కాస్తారని కాదని రజని విమర్శించారు. ప్లెక్సీ మీద చెయ్యి వెయ్యి, చెయ్యి విరగదీస్తా. నువ్వు రారా చూసుకుందాం. నువ్వు మోగోడివైతే రారా.. అని ఒక గ్రంథాలయ చైర్మన్‌ అంటే ఆమైపె చర్యలు తీసుకోవాలని కదా అని ప్రశ్నించారు. కర్రలు పట్టుకుని వచ్చిన వారిని అక్కడి నుంచి అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీసుస్టేషన్‌కు తీసుకు వచ్చి ఉండవచ్చు కానీ మీరు ఉరంతా తిప్పారని ఆరోపించారు. కర్రలు పట్టుకునే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్తి నష్టం కలుగచేసిన ప్రతి ఒక్కరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్లెక్సీలు తీయించేది మున్సిపల్‌ అధికారుల బాధ్యత అంటున్నారని, వారిని కూడా నిలదీస్తానని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement