నిర్మల స్కూల్ ఆగడాలను అరికట్టండి
ఆత్మకూరులోని నిర్మల స్కూల్లో మా పిల్లలు 2024–25 సీబీఎస్‌ఈ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించారు. సీబీఎస్‌ఈ బోర్డు గత ఏడాది జూన్‌లో ఉత్తీర్ణతకు సంబంధించిన సర్టిఫికెట్లు పంపారు. స్కూల్ యాజమాన్యం వాటిని పోగొట్టింది. 10వ తరగతి ఒరిజినల్ మార్కుల మెమోలను అడుగుతుంటే పొంతనలేని సమాధానం చెబుతూ బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయండి.
– బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, ఆత్మకూరు.
నేను వృద్ధాప్య పింఛన్ కోసం ఏడాది నుంచి అర్జీలు పెడుతూనే ఉన్నాను. చూద్దాం, చేద్దాం అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతున్నాను. పింఛన్ వస్తే ఈ వయస్సులో కొన్ని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మొర ఆలకించి ఇబ్బంది పెట్టకుండా పింఛన్ మంజూరు చేస్తారని కోరుకుంటున్నాను.
– తమడ రాజారావు, గుంటూరు
నిర్మల స్కూల్ ఆగడాలను అరికట్టండి


