గుంటూరు
న్యూస్‌రీల్
టెన్త్ పబ్లిక్ పరీక్షలకు నెలన్నరే వ్యవధి అల్పాహారానికి నోచుకోని విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంతో నూరు రోజుల ప్రణాళిక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా తరగతులు గుంటూరు మినహా పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కడుపు మాడ్చుకుని చదువుతున్న విద్యార్థులు
మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3400, గరిష్ట ధర రూ.4800, మోడల్ ధర రూ.4200 వరకు పలికింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిల్వ 54.90 టీఎంసీలు.
గుంటూరుఎడ్యుకేషన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి సన్నద్ధమవుతున్న విద్యార్థులకు అల్పాహారం కరువైంది. మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకధాటిగా నిర్వహిస్తున్న రెగ్యులర్, అదనపు తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు మధ్యాహ్న భోజనంతో సరిపెట్టుకుని, సాయంత్రం అదనపు తరగతులు ముగిసే వరకు ఖాళీ కడుపులతో చదువుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 32,276 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
ఉదయం ఏడు గంటలకే పాఠశాలలకు పయనం
పట్టణ, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలకు దూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలకోర్చి ఉదయం 7 గంటలకే వస్తున్న విద్యార్థులు సాయంత్రం వరకు చదువులో నిమగ్నమై ఉంటున్నారు. టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో ఎస్సీఈఆర్టీ ద్వారా నూరు రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన ప్రభుత్వం పాఠశాలల్లో నిర్భంధంగా అమలు చేస్తోంది.
7
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు


