రేపటి నుంచి మెడ్‌ఫ్యూజన్‌ | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి మెడ్‌ఫ్యూజన్‌

Feb 3 2026 7:37 AM | Updated on Feb 3 2026 7:37 AM

రేపటి

రేపటి నుంచి మెడ్‌ఫ్యూజన్‌

● గర్భిణీ ఒక బిడ్డకు జన్మనిచ్చేందుకు ఎంతకష్ట పడుతుందో, బిడ్డను భూమిపైకి తెచ్చి ఊపిరి పోసేందుకు వైద్యులు ఎంత కష్టపడతారో నేరుగా చూడాలకుంటున్నారా.... ● గుప్పెడంత గుండె ఏ రంగులో ఉంటుంది. లబ్‌డబ్‌ అంటూ ఎలా కొట్టుకుంటుంది. గుండెకు చికిత్స ఎలా అందిస్తారు. ● ఆపరేషన్‌ థియేటర్‌లో మత్తు ఎలా ఇస్తారు. రోగికి నొప్పి లేకుండా వైద్యులు ఆపరేషన్‌ ఎలా చేస్తారనే ఆసక్తికర విషయాలను నేరుగా కళ్లతో చూడాలనుకుంటే..

గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం 30 ఏళ్ల తరువాత తిరిగి ఏర్పాటు మానవ శరీర అవయవాలు ప్రత్యక్షంగా చూడవచ్చు ఆపరేషన్లు సైతం నేరుగా వీక్షించవచ్చు

ప్రతి ఒక్కరు సందర్శించి తెలుసుకోండి....

గుంటూరు మెడికల్‌: మీ పిల్లలు డాక్టర్లు కావాలని కోరుకుంటున్నారా..

గుంటూరు వైద్య కళాశాలకు రండి. ఆస్పత్రుల్లో ఉండే మర్మమైన, ఎన్నో గమ్మతైన విషయాలు, ఎప్పుడు కళ్లతో నేరుగా చూడలేని చికిత్సలు చూసే అత్యంత అద్భుతమైన అవకాశం వచ్చింది. అది గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన మెడికల్‌ ఎగ్జిబిషన్‌ ద్వారా ప్రతి ఒక్కరు వైద్య రంగంలోని ఆసక్తికర విషయాలను ప్రత్యక్షంగా చూడొచ్చు. గుంటూరు వైద్య కళాశాలలో బుధవారం నుంచి మెడ్‌ఫ్యూజన్‌ పేరుతో మెడికల్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇది మూడు వారాలపాటు కొనసాగనుంది.

ఎగ్జిబిషన్‌ ప్రత్యేకతలు...

గుంటూరు వైద్య కళాశాలలో 30 ఏళ్ల క్రితం మెడికల్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగార్జునకొండ వెంకటసుందరాచారి ఆధ్వర్యంలో బుధవారం ఎగ్జిబిషన్‌ ప్రారంభం కానుంది. 40 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం గుంటూరు వైద్య కళాశాల కాలేజీ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఫండ్‌ను రూ.కోటిన్నర మేర ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం ఎగ్జిబిషన్‌ వీక్షించేందుకు 2,500 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. సుమారు లక్షన్నర మంది వీక్షిస్తారని నిర్వాహకులు అభిప్రాయ పడుతున్నారు.

శరీరభాగాలు నేరుగా చూడొచ్చు....

ప్రతి అవయవవాన్ని నేరుగా చూడొచ్చు. అస్థిపంజరం చూడొచ్చు. వ్యాధులు శరీరానికి ఏ విధంగా సోకుతాయి. అవయవాలు ఏ విధంగా పాడవుతాయి. వ్యాధులను ఏ విధంగా గుర్తిస్తారు. వ్యాధులకు చికిత్సలు, ఆపరేషన్లు ఎలా చేస్తారు ఇలా నేరుగా చూసి కూలంకుషంగా తెలుసుకుని సందేహాలు పూర్తిగా నివృత్తి చేసుకోవచ్చు.

గుంటూరు వైద్య కళాశాలలో ఈనెల 4న ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ ఎగ్జిబిషన్‌ను ప్రతి ఒక్కరు సందర్శించి వైద్య రంగం గురించి తెలుసుకోండి. సుమారు 30 ఏళ్ల తరువాత ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ ఎగ్జిబిషన్‌ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి వైద్య రంగంపై అవగాహన కల్పించటమే. గతంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ ఎగ్జిబిషన్‌ల ద్వారా ఎంతో మంది ప్రేరణ పొంది వైద్య రంగంలోకి వచ్చి ఎంతో మంది ప్రాణాలు రక్షిస్తున్నారు. స్కూల్‌, కాలేజ్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా మెడికల్‌ ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తే మంచి అనుభూతి పొందుతారు.

– డాక్టర్‌ నాగార్జునకొండ

వెంకటసుందరాచారి,

ప్రిన్సిపాల్‌, గుంటూరు వైద్యకళాశాల,

రేపటి నుంచి మెడ్‌ఫ్యూజన్‌ 1
1/1

రేపటి నుంచి మెడ్‌ఫ్యూజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement