అంబటిపై దాడి.. పోలీసుల సమక్షంలో ఇంత బరితెగింపా?: భూమన | Bhumana Karunakar Reddy Says Attack On YSRCP Leader Ambati Rambabu Is An Assault On Democracy | Sakshi
Sakshi News home page

అంబటిపై దాడి.. పోలీసుల సమక్షంలో ఇంత బరితెగింపా?: భూమన

Feb 1 2026 11:47 AM | Updated on Feb 1 2026 12:51 PM

Bhumana Karunakar Reddy Serious Comments On CBN Govt

సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడి అని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి. పోలీసులు సమక్షంలో ఇంత బరితెగించి దాడులు చేయడమేంటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉన్న వారికి బాధ్యత లేదా? అని మండిపడ్డారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని ఖండిస్తూ టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి పద్మావతి పురంలో తన నివాసం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనలకు దిగారు. ఈ సందర్బంగా భూమన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న నాయకుడు అంబటి రాంబాబు. దాడి అత్యంత హేయమైనది, నీచమైనది. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడం జరిగింది. అంబటికి చెందిన ఆస్తుల్ని ధ్వంసం చేసి.. దాడి చేస్తే బయటకు రారు అనే ఉద్దేశ్యంతో ఇలా చేశారు.

రాంబాబుపై టీడీపీ నేతలు, కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుతో తలదించుకోవాలి. ఆయన మాట తూలిన మాట వాస్తవం. అందుకు అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. ఆయన ఇంటిపై దాడి చేసి, ధ్వంసం చేశారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాలి. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా?. పోలీసుల సమక్షంలో ఇంత బరితెగించడమేంటి?. ప్రతీకార ద్వేషంతో హంతక ముఠా దాడులు చేశారు. ప్రతి మండల కేంద్రంలో లడ్డూ వివాదంలో ఫ్లెక్సీలు పెట్టించారు. కాపు నాయకులపై దాడి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది అని ఘాటు విమర్శలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement