తిరుపతి: తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని రెండు రోజులకే పరిమితం చేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తప్పుబట్టారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని 26 మంది పీఠాధిపతుల ఆగమ సలహాల మేరకు 10 రోజుల దర్శనం ఏర్పాటు చేస్తే ఇప్పుడు దాన్ని రెండు రోజులకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకోవడం సరైనది కాదన్నారు. ఆ రోజు పీఠాధిపతులు ఇచ్చిన సూచనలు ఇప్పుడు తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మొత్తం 32 మంది ప్రముఖులతో చర్చించిన తర్వాతనే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం 10 రోజులపాటు ఉండే విధంగా ఏర్పాటు చేశామన్నారు.
2020లో జగన్ సీఎంగా ఉండగా పదిరోజులు పాటు వైకుంఠ ఏకాదశి పదిరోజులు దర్శనం అందుబాటులోకి తీసుకువచ్చాం. కృష్ణ మూర్తి వైద్యనాధన్ అప్పుడు బోర్డు సభ్యులు ఆనాడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. శృంగేరీ మఠం, ఆండవాన్ వన్ మఠం, త్రిదండి ,ఉత్తరాది, వ్యాసారాజ మఠం, పేజావర్ మఠం, అహోబిల మఠం పీఠాధిపతులు సూచనలు సలహాలు తీసుకునే ఈ నిర్ణయం ఆనాడు తీసుకున్నాం. ద్రావిడ సంప్రదాయం అంటూ కొత్తపల్లవి అందుకున్నారు.
12 మంది ఆళ్వారులు స్వామి వారిని కీర్తి, నారాయణ దివ్య ప్రబంధంగా ఇప్పటికీ నిరంతరం కొనసాగుతున్న పక్రియ. ద్రావిడ సంప్రదాయం కొనసాగించవద్దు అని వితండ వాదం చేస్తున్నారు ప్రస్తుత టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత ఏడాది 6మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు, మీ పరిపాలన లోపం వల్ల జరిగింది. తిరుమలలో 10 సార్లు, 12 సార్లు ఏడాదికి జరిగేవి, కాలానికి అనుగుణంగా పూర్వ కాలం నిర్ణయాల్లో మార్పులు వచ్చాయి.
మీ నిర్ణయం వల్ల 10 లక్షల మందికి వైకుంఠ ఏకాదశి దర్శనం దూరం చేస్తున్నారు. మీ ఒత్తిడి వల్లే ఆగమ శాస్త్ర సలహాదారులు తలొగ్గారు, రెండు రోజులకు తగ్గించాలనే అలోచన మానుకోవాలి. స్థానికులకు దైవ దర్శనం దూరం చేయాలని చూస్తున్నారు, నాలుగేళ్లు పదిరోజులు పాటు వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం లక్షలాది మందికి మేము సమర్ధవంతంగా నిర్వహించాము. శ్రీరంగం తరువాత తిరుమల లో పదిరోజులు పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం అందుబాటులోకి తీసుకు వచ్చాం. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు ఉన్న ఈవోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. శ్రీరంగం ద్రావిడ సంస్కృతి అంటూ తెరపైకి తీసుకు వస్తున్నారు. రెండు రోజులకే కుదించాలని చేస్తున్న కుట్ర మానుకోవాలి. రెండు రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్వనం 110 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లే’ అని భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు.


