‘స్త్రీలోలుడు, వికృత చేష్టల్లో ఆరితేరినవాడు బీఆర్‌ నాయుడు’ | bhumana karunakar reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘స్త్రీలోలుడు, వికృత చేష్టల్లో ఆరితేరినవాడు బీఆర్‌ నాయుడు’

Jun 14 2026 11:25 AM | Updated on Jun 14 2026 12:00 PM

bhumana karunakar reddy slams chandrababu naidu

సాక్షి,తిరుపతి: మహానేత వైఎస్సార్‌ఆర్‌పై శివానంద స్వామి తదితరులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం తిరుపతి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు.

కొంతమంది స్వాములు టీడీపీ నేతలు కంటే దిగజారారు. కాషాయ స్వాములు పచ్చ జెండా ఎత్తుకుని మహానేత వైఎస్‌ఆర్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బూతు సినిమాల నిర్మాత అట్లూరి నారాయణ కొండ మీద బ్లాక్‌ టికెట్లు అమ్ముతాడు. శ్రీను బాలికను అత్యాచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ఆదేశాలతో ఆధ్యాత్మిక సభ జరిగింది. స్త్రీలోలుడు, వికృత చేష్టల్లో ఆరితేరినవాడు బీఆర్‌ నాయుడు. అలాంటి బీఆర్‌ నాయుడికి కొంత మంది స్వాములు తొత్తులుగా మారారు. శ్రీను నీవు కాషాయం వేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతావా?.

కొంత మంది స్వాములను టీడీపీ జెండాలు మార్చే కూలీలుగా బీఆర్‌ నాయుడు మార్చాడు. కొంత మంది సాధువులు కాషా వస్త్రాలు వదిలి పచ్చ చొక్కాలు వేసుకోవాలి. దేవుడిని రాజకీయ వనరుగా వాడుకుంది చంద్రబాబే. వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చిన చంద్రబాబుపై సాధువులు ఎందుకు మాట్లాడరు?.చంద్రబాబు పాలనను రామరాజ్యం అంటున్నారంటే మూటలు బాగానే అంది ఉంటాయి. 

రెండు కొండలను ఏడు కొండలుగా మార్చి జీవో ఇచ్చింది వైఎస్ఆరే. వేద విశ్వవిద్యాలయం స్థాపించింది వైఎస్‌ఆర్‌. పేదలకు పెళ్లిళ్లు చేసిన గొప్ప మనసున్న నాయకుడు వైఎస్‌ఆర్‌.ఊరువాడా భజన మండళ్లు నిర్మించిన గొప్ప నాయకుడుకు వైఎస్‌ఆర్‌. వెంకటేశ్వర భక్తి ఛానల్‌ తీసుకొచ్చింది వైఎస్‌ఆర్‌. వెంకటేశ్వర భక్తి ఛానల్‌ వద్దన్నది చంద్రబాబు. గోమాతను పరిరక్షించాలని కంకణం కట్టుకున్న నాయకుడు వైఎస్‌ జగన్‌. నవనీత సేవ తీసుకొచ్చింది వైఎస్‌ జగన్’ అని భూమన గుర్తు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement