బీఆర్‌ నాయుడు దూరంగా ఉండటం చంద్రబాబు నటనే: భూమన | YSRCP Bhumana Karunakar Reddy Serious Comments On TTD BR Naidu | Sakshi
Sakshi News home page

బీఆర్‌ నాయుడు ఏ టెక్నాలజీతో మాయమయ్యాడో?: భూమన

Mar 22 2026 12:35 PM | Updated on Mar 22 2026 3:57 PM

YSRCP Bhumana Karunakar Reddy Serious Comments On TTD BR Naidu

సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అంటకాగుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి. బీఆర్‌ నాయుడును దూరంగా ఉంచినట్టు చంద్రబాబు నటించారని చెప్పుకొచ్చారు. వెంకటేశ్వర స్వామితో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్‌ నాయుడును అటెండర్‌ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుమల పర్యటన సందర్భంగా చంద్రబాబు.. బీఆర్‌ నాయుడును దూరంగా ఉంచినట్టు నటించారు. చంద్రబాబు కార్యకర్తలతో కూడా నాటకాలు ఆడుతున్నారు. బీఆర్‌ నాయుడుది కల్మష స్వభావం. చంద్రబాబు అన్నప్రసాదానికి వెళ్లే బీఆర్‌ నాయుడు నక్కి నక్కి ఉన్నారు. బీఆర్‌ నాయుడుకు అటెండర్‌ కూడా పట్టించుకోరు. నీతి మాలిన బీఆర్‌ నాయుడు నిస్సిగ్గుగా తిరుగుతున్నాడు. బీఆర్‌ నాయుడును తీసేసి దేవాలయ ప్రతిష్ట కాపాడితే అర్థవంతంగా ఉండేది.

కీలక సమావేశంలోనే బీఆర్‌ నాయుడు.. చంద్రబాబు పక్కన లేడు. బీఆర్‌ నాయుడు ఏ టెక్నాలజీతో మాయం అయ్యాడో?. ప్రసాదం ఇచ్చే సమయంలోనూ మాయావి బీఆర్‌ నాయకుడు మాయమయ్యాడు. బీఆర్‌ నాయుడికి సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాల్సిందే. వీధిలో ఉండలేడు, ఇంట్లోకి రానివ్వరు అన్నట్టు బీఆర్‌ నాయుడు పరిస్థితి ఉంది. నిన్న ఘటన చూసిన తర్వాత బీఆర్‌ నాయుడుకి ఎవరైనా మర్యాద ఇస్తారా?. అధికారం లేని పదవి, ఆదరణలేని ఉద్యోగుల మధ్య ఉండటం అవసరమా?. బీఆర్‌ నాయుడుని తీసేయడానికి చంద్రబాబుకు భయం. చంద్రబాబు పరిస్థితి మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉంది. చంద్రబాబు, బీఆర్‌ నాయుడు ఇద్దరూ స్వామి వారి ద్రోహులే. చంద్రబాబు ఓ కళంకితుడికి పదవి ఇచ్చారు. అసమర్థుడు అని తేలిన తర్వాత కూడా బీఆర్‌ నాయుడు పదవి అంటిపెట్టుకున్నారు. పవన కల్యాణనంద స్వాముల వారు కొండపై ప్రతీ రాయిని కడిగినా పాపం పోదు.

బీఆర్‌ నాయుడు కుమారుడు జూబ్లీహిల్స్‌ సొసైటీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఏప్రిల్‌ ఐదో తేదీన జూబ్లీహిల్స్‌ సొసైటీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసమే బీఆర్‌ నాయుడు టీటీడీ చైర్మన్‌ పదవిలో కొనసాగుతున్నారా?. బీఆర్‌ నాయుడుని ఇంకా పదవిలో కొనసాగించడం అత్యంత హేయం అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. 

Advertisement
 
Advertisement
Advertisement