సాక్షి, తిరుపతి: టీటీడీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. టీటీడీ పవిత్ర స్థలాన్ని 7 స్టార్ హోటళ్లకు ఇవ్వడం సరికాదన్నారు. దేవుడి ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. ప్రజా సంఘాలు, హిందుత్వ సంఘాలు ఆందోళనలు
చేపట్టాలని భూమన పిలుపునిచ్చారు.

‘‘ఎర్ర చందనం చెట్లకు కొత్తగా నెంబర్లు వేస్తున్నారు. ఒక్కో చెట్టుకు రెండు నంబర్లు వేస్తూ మోసం చేస్తున్నారు. ఎర్ర చందనం దుంగుల్ని కాపాడతానన్న పవన్ ఎక్కడ?. ఏపీ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలి’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.



