
సాక్షి,తిరుపతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బీఆర్ నాయుడు ఛానల్ విషప్రచారం చేస్తోందని మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ తిరుమల పర్యటన అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాం కంటే వైఎస్సార్,జగన్ పాలనలోనే కొన్ని వేల రెట్లు హిందూ ధర్మ పరిరక్షణ జరిగింది. జగన్ ఐదేళ్లు సీఎంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీనివాస దివ్య హోమం జగన్ పాలనలోనే ప్రారంభమైంది’ అని స్పష్టం చేశారు.