‘టీటీడీని ఎవరూ ప్రశ్నించలేదు.. టీడీపీని మాత్రమే ప్రశ్నించాం’ | Bhumana Karunakar Reddy Slams Chandrababu Government Over Indapur Dairy | Sakshi
Sakshi News home page

‘టీటీడీని ఎవరూ ప్రశ్నించలేదు.. టీడీపీని మాత్రమే ప్రశ్నించాం’

Feb 18 2026 4:15 PM | Updated on Feb 18 2026 6:02 PM

Bhumana Karunakar Reddy Slams Chandrababu Government Over Indapur Dairy

సాక్షి,తిరుపతి: టీటీడీని ఎవరు ప్రశ్నించలేదు.. టీడీపీని మాత్రమే ప్రశ్నిస్తున్నామని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు.  బుధవారం తిరుపతి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఇందాపూర్‌ డైయిరీ వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు.  

నెయ్యి సరఫరాకి నందిని డెయిరీకి సింగిల్‌ టెండర్‌కే ఇచ్చారు. ఇందాపూర్‌ డెయిరీకి L3 టెండర్‌కే ఇచ్చారు. మదర్‌ డెయిరీ,ఇందాపూర్‌ డెయిరీ 130కోట్లకు టెండర్‌ దక్కించుకుంది. నిబంధనలు కఠిన తరం చేశామని టీటీడీ చెబుతోంది. 1500కిలోమీటర్ల నిబంధన 800కి కుదించారు.  

మేం పెట్టిన నిబంధనలనే ఎక్స్‌పర్ట్‌ కమిటీ కూడా కొనసాగించింది. అయితే, నిబంధనలు తుంగలో తొక్కి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఇందాపూర్‌ డెయిరీకి టెండర్‌ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.  గుమ్మడికాయల దొంగ ఎవరంటే.. తడుముకున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. 

Bhumana: నెయ్యి సరఫరాలో గోల్ మాల్.. 130 కోట్ల టెండర్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement