సంబరాల వేదిక.. సాంకేతిక సౌధం | - | Sakshi
Sakshi News home page

సంబరాల వేదిక.. సాంకేతిక సౌధం

Mar 2 2026 7:19 AM | Updated on Mar 2 2026 7:19 AM

సంబరా

సంబరాల వేదిక.. సాంకేతిక సౌధం

● తిరుపతి ఐఐటీలో ఉత్సాహంగా తిరుత్సవ–2026 కల్చరల్‌ ఫెస్ట్‌ ● సింగర్‌ హేమచంద్ర, ఇండియన్‌ ఐడల్‌ సింగర్‌ అనుజ్‌ రిహాన్‌ గానామృతం నేటికి వాయిదా ● ఉత్సాహంగా పాల్గొన్న ఐఐటీ విద్యార్థులు

ఏర్పేడు: ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ప్రతి ఏటా విజ్ఞానం మేళవింపుగా జరిగే టెక్నో కల్చరల్‌ ఫెస్ట్‌ తిరుత్సవ–2026 ఈ ఏడాది కూడా వేడుకగా సాగుతున్నాయి. ఐఐటీ ప్రాంగణంలో తిరుత్సవ సంబరాలు మూడు రోజులపాటు ఎంతో వైభవంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మర్డర్‌ మిస్టరీ ఛేదించడంతో విద్యార్థులు ఎంతో ఉత్కంఠ చూపుతూ సాంకేతిక విజ్ఞానాన్ని మేళవించారు. స్క్విడ్‌ గేమ్‌, బ్లైండ్‌ ఫొటోగ్రఫీ పోటీలలో విద్యార్థులు ఉత్సుకతతో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వర్క్‌షాపుల్లో పాల్గొన్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేసేందుకు ఐఐటీ ప్రొఫెసర్లు పలు సూచనలు, విలువైన సమాచారాన్ని అందించారు. క్యాంపస్‌ అంతటా ఆలోచింపజేసే విభిన్న చిత్రాలను, పోస్టర్లను ఐఐటీ విద్యార్థులు రూపొందించి ప్రదర్శించారు.

సినీ సంగీత విభావరి నేటికి వాయిదా

ఆదివారం రాత్రి ముగింపు ఉత్సవాలలో భాగంగా తెలుగు సినీ నేపథ్య గాయకుడు వేదల హేమచంద్ర, ఇండియన్‌ ఐడల్‌ సింగర్‌ అనుజ్‌ రిహాన్‌ వారి బృందాలతో కలసి మ్యూజికల్‌ నైట్‌ ఈవెంట్‌ నిర్వహించాల్సి ఉంది. ఈ మ్యూజికల్‌ నైట్‌ నేటికి వాయిదా పడింది. ఆడియో కంట్రోలర్‌లో సాంకేతిక సమస్యలతో సాంకేతిక సిబ్బంది శ్రమించినా ఫలితం లేకపోయింది. ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ సత్యనారాయణ, పీఆర్‌ఓ చమన్‌మెహతా పరిస్థితిపై సమీక్షించారు. ఈ కార్యక్రమం సోమవారం కొనసాగిస్తామన్నారు. తిరుత్సవ ఈవెంట్‌ హెడ్‌ ప్రణతి పర్యవేక్షించారు.

సంబరాల వేదిక.. సాంకేతిక సౌధం1
1/3

సంబరాల వేదిక.. సాంకేతిక సౌధం

సంబరాల వేదిక.. సాంకేతిక సౌధం2
2/3

సంబరాల వేదిక.. సాంకేతిక సౌధం

సంబరాల వేదిక.. సాంకేతిక సౌధం3
3/3

సంబరాల వేదిక.. సాంకేతిక సౌధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement