సెలవురోజు భూదందా | - | Sakshi
Sakshi News home page

సెలవురోజు భూదందా

Mar 2 2026 7:19 AM | Updated on Mar 2 2026 7:19 AM

సెలవు

సెలవురోజు భూదందా

● స్థానికులు అడ్డగించడంతో ప్లేట్‌ ఫిరాయించిన నాయకులు ● స్థానికులపై దౌర్జన్యం చేసిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు

రేణిగుంట: మండలంలోని జీపాళెం పంచాయతీ, పద్మానగర్‌లో ఉన్న ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. కుర్రకాలవ లెక్క దాఖల సర్వేనెంబర్‌ 5/1,2, లో గత ప్రభుత్వంలో పేదలు ఇళ్లు నిర్మించుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూమి ప్రజా అవసరాల కోసం కేటాయించిందని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఇళ్లను నేలమట్టం చేశారు. ఆ స్థలంపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. ఆదివారం కావడం అందులోనూ అధికారులందరూ విమానాశ్రయంలో ప్రోటోకాల్‌ డ్యూటీలో ఉండడంతో ఇదే అదనుగా భావించిన టీడీపీ నాయకుడు తమ అనుచరులతో కలిసి పద్మానగర్‌ కి చేరుకొని జేసీబీ పెట్టి చదును చేసే పనులను మొదలుపెట్టారు. స్థానికులు వచ్చి అడ్డుకోవడంతో వారిపై టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. వివాదం తీవ్రమవడంతో గాజుల మండ్యం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని టీడీపీ నాయకులను సంఘటన స్థలం నుంచి పంపించారు. గ్రామంలో ఇంత జరుగుతున్నా కనీసం వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి సంఘటన స్థలానికి రాకపోవడంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు స్కూల్‌, శ్మశాన వాటిక పేరు తెర వెనుక విలువైన ప్రభుత్వ భూమిని సొంతం చేసుకునే ఆలోచనతోనే ఆదివారం అధికారులు ఎవరూ లేకుండా వచ్చి భూమిని చదును చేశారని, స్థానికులంతా ఏకమవడంతో ప్రభుత్వ భవనాలకు అంటూ బుకాయిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు

గత ప్రభుత్వంలో తామంతా అప్పటి అధికారులను ప్రాధేయపడి అప్పుచేసి కట్టుకున్న ఇళ్లను గత సంవత్సరం అధికారులు కూల్చివేశారు. అదే స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. మేమంతా వచ్చి అడ్డుకుంటే ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అని అబద్దాలు చెబుతున్నారు. – పి.అమ్ములు, స్థానికురాలు,

పద్మా నగర్‌

దౌర్జన్యం చేస్తున్నారు

కొందరు టీడీపీ నాయకులు జేసీబీతో గతంలో మా ఇళ్లు ఉన్న ప్రదేశంలో చదును చేస్తుంటే స్థానికలంతా వచ్చి అడ్డుకున్నాం. అధికార పార్టీ నాయకులైన మమ్మల్ని అడ్డుకుంటారా అని దుర్భాషలాడి, దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. అధికార పార్టీ ఒత్తిడితో అధికారులు ఇటువైపు రాకపోవడం శోచనీయం. ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులు కబ్జా చేసేందుకే ఇదంతా చేస్తున్నారు.

– బి.అమ్ములు, పద్మా నగర్‌

సెలవురోజు భూదందా1
1/4

సెలవురోజు భూదందా

సెలవురోజు భూదందా2
2/4

సెలవురోజు భూదందా

సెలవురోజు భూదందా3
3/4

సెలవురోజు భూదందా

సెలవురోజు భూదందా4
4/4

సెలవురోజు భూదందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement