● న్యాయస్థానాలకు భూమిపూజ
తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద 16 కోర్టుల భవనాల సముదాయం నిర్మాణానికి ఆదివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ భూమి పూజ చేశారు. అలాగే శిలాఫలకం ఆవిష్కరించారు. తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద 14.49 ఎకరాల విస్తీర్ణంలో 16 కోర్టుల నూతన సముదాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నరసింహ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీ పాల్గొన్నారు. – తిరుపతి లీగల్


