తిరుపతిలో భారత్‌–కెనడా ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ | - | Sakshi
Sakshi News home page

తిరుపతిలో భారత్‌–కెనడా ఇన్నోవేషన్‌ క్యాంపస్‌

Mar 2 2026 7:19 AM | Updated on Mar 2 2026 7:19 AM

తిరుప

తిరుపతిలో భారత్‌–కెనడా ఇన్నోవేషన్‌ క్యాంపస్‌

ఏర్పేడు: భారతదేశం–కెనడా విద్యా, ఆవిష్కరణ సహకారానికి ప్రోత్సాహకంగా డల్హౌసీ విశ్వవిద్యాలయం (కెనడా), తిరుపతి ఐఐటీ, తిరుపతి ఐసర్‌ శనివారం ట్రై–ఇన్‌స్టిట్యూషనల్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ను స్థాపించడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ముంబైలో జరిగిన ఓ సదస్సులో డల్హౌసీ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కిమ్‌ బ్రూక్స్‌, తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ సత్యనారాయణ, ఐసర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శాంతను భట్టాచార్య ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశార ఈ సమావేశంలో డల్హౌసీ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు, వైస్‌–ఛాన్సలర్‌ డాక్టర్‌ కింబర్లీ రూత్‌ బ్రూక్స్‌, తిరుపతి ఐసర్‌ డైరెక్టర్‌ శాంతను భట్టాచార్య ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. దీని ద్వారా ట్రై ఇనిస్టిట్యూషనల్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ క్యాంపస్‌తో అత్యాధునిక ఆవిష్కరణలను తీసుకురాగలమన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు అందరూ హాజరు కావాలి

తిరుపతి అర్బన్‌: కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌కు తప్పకుండా ఆయా విభాగాలకు చెందిన హెచ్‌ఓడీలు(హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌) హాజరు కావాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదివారం స్పష్టం చేశారు. సోమవారం అన్ని విభాగాలకు చెందిన అధికారులు వందశాతం హాజరు కావాలని వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు అర్జీదారులకు అందుబాటులో అధికారులు ఉండాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీదారులకు అన్ని వసతులు కల్పించాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

తిరుపతిలో భారత్‌–కెనడా ఇన్నోవేషన్‌ క్యాంపస్‌1
1/1

తిరుపతిలో భారత్‌–కెనడా ఇన్నోవేషన్‌ క్యాంపస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement