శ్రీవారి దర్శనానికి 24 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

Mar 2 2026 7:19 AM | Updated on Mar 2 2026 7:19 AM

శ్రీవ

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 75,428 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,240 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.56 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

నిజాయితీ చాటిన ఆటోడ్రైవర్‌

రేణిగుంట: వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన సుధా అనే మహిళ రేణిగుంట రైల్వే స్టేషన్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం ఆటోలో ప్రయాణించింది. తిరుపతి వద్ద దిగిన అనంతరం తన బ్యాగ్‌ను ఆటోలో మర్చిపోయింది. ఆటో డ్రైవర్‌ వెంకటరత్నం తిరిగి రేణిగుంటకు వచ్చాక ఆటోలో ఉన్న బ్యాగ్‌ను గమనించారు. వెంటనే రేణిగుంట పోలీస్‌ స్టేషన్‌కు స్వయంగా తీసుకొచ్చి అప్పగించాడు. పోలీసులు బ్యాగ్‌ యజమానురాలైన సుధాను గుర్తించి, బ్యాగ్‌లో ఉన్న లాప్‌టాప్‌, బంగారు గొలుసును ఆమెకు అప్పగించారు. నిజాయితీపరుడైన ఆటోడ్రైవర్‌ వెంకటరత్నంను పోలీసులు అభినందించారు.

కట్టెల కోసం వెళ్లి మృత్యువాత

వరదయ్యపాళెం: ఇంట్లోని కట్టెల పొయ్యికి అవసరమయ్యే వంట చెరుకు కోసం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి తిరుగు పయనంలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని మహిళ మరణించింది. ఈ ఘటన వీకేఆర్‌వైకాలనీ కూడలి సమీపంలో చోటు చేసుకుంది. శ్రీసిటీ పోలీస్‌ స్టేషన్‌లో బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. చిన్న పాండూరు వడ్డిపాళెంకు చెందిన ఇ.చిలకమ్మ(50) తమ ఇంట్లోని కట్టెల పొయ్యికి అవసరమయ్యే కట్టెపుల్లల కోసం వీకేఆర్‌వైకాలనీకి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ కట్టెపుల్లలు సేకరించుకుని తన కుమారుడు తీసుకువచ్చిన ద్విచక్ర వాహనంపై కట్టెపుల్లల మోపును ఇంటికి పంపింది. వెనుకనే తానూ నడుచుకుని వస్తూ రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ఓ మినీ వ్యాను ఢీకొంది. దీంతో చికిత్స నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న శ్రీసిటీ ఎస్‌ఐ ప్రియాంక సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. చిలకమ్మ మృత దేహానికి శవపంచనామా నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇన్‌స్పైర్‌ అవార్డుకు కత్తెరపల్లి విద్యార్థిని ఎంపిక

కార్వేటినగరం: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నా లజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డుకు కార్వేటినగరం మండలం కత్తెరపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.చాందిని ఎంపికై నట్టు హెచ్‌ఎం చంగల్‌ రాజు తెలిపారు. హెచ్‌ఎం ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ 7వ తరగతి చదువుతున్న చాందిని రూపొందించిన స్మార్ట్‌ హెల్మెట్‌ బై ది రైడర్‌ అనే వినూత్న ప్రాజెక్టు జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు, ద్విచక్ర వాహనాదుల రక్షణను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అదే విధంగా జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రదర్శనలో విద్యార్థిని పాల్గొననున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిస్తే రాష్ట్ర స్థాయికి ఎంపికవుతుందని పేర్కొన్నారు. విద్యార్థినిని సైన్స్‌ ఉపాధ్యాయులు సుప్రసన్న, సురేఖ, బాబు అభినందించారు.

వైఈఎస్‌ చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని శ్రీకృష్ణ మందిరంలో ఆదివారం జిల్లా యాదవ ఉద్యోగుల సంఘం (వైఈఎస్‌) సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి యాదవ్‌, ప్రధాన కార్యదర్శి దేవేంద్ర యాదవ్‌ ఆధ్వర్యంలో ఆ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్‌.విక్రమన్‌ యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శిగా అన్నా కుప్పస్వామి యాదవ్‌, ఆర్థిక కార్యదర్శిగా శంకర్‌ యాదవ్‌, గౌరవాధ్యక్షుడిగా రామచంద్ర యాదవ్‌, గౌరవ సలహాదారుగా కె.చిట్టిబాబు యాదవ్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా బంగారమ్మ యాదవ్‌, రాష్ట్ర కౌన్సిలర్‌గా దేవేంద్ర యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కార్యవర్గ సభ్యులు గురుమూర్తి, గోవిందస్వామి, వెంకటేశు యాదవ్‌, ఎన్‌ఆర్‌ఎస్‌ యాదవ్‌, మోహన మురళీ యాదవ్‌, బాబు యాదవ్‌, దేవయ్య యాదవ్‌ పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు 
1
1/3

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

శ్రీవారి దర్శనానికి 24 గంటలు 
2
2/3

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

శ్రీవారి దర్శనానికి 24 గంటలు 
3
3/3

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement