మళ్లీ భారీగా అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం | Andhra Pradesh Government Borrows Again | Sakshi
Sakshi News home page

మళ్లీ భారీగా అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం

Mar 24 2026 7:02 PM | Updated on Mar 24 2026 7:22 PM

 Andhra Pradesh Government Borrows Again

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మళ్లీ భారీగా అప్పు చేసింది. ఇవాళ (మార్చి 24న) రూ.3,900 కోట్లు అప్పు తెచ్చింది. రిజర్వ్‌ బ్యాంకు సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు సమీకరణ చేసుకుంది. గత మంగళవారమే చంద్రబాబు సర్కారు రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చిన విషయం తెలిసిందే. 

వారం తిరగకుండానే మళ్లీ రూ.3,900 కో అప్పు తెచ్చింది. చంద్రబాబు పాలనలో అప్పుల్లో నెంబర్ వన్‌గా ఏపీ తయారైంది. చంద్రబాబు ప్రభుత్వం అప్పు రూ.3,37,221 కోట్లకు చేరింది. 22 నెలల్లోనే ఇన్ని కోట్ల అప్పు చేసింది. రూ.1,86,164 కోట్ల బడ్జెటరీ అప్పులు చేసింది. ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.1,03,670 కోట్లు అప్పు, అమరావతి పేరుతో రూ.47,387 కోట్లు అప్పులు తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement