రామనారాయణం - శ్రీమద్రామాయణ ప్రాంగణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోణి విజయనగరం జిల్లాకు చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.
విజయనగరానికి చెందిన ఎన్.సి.ఎస్.ఛారిటబుల్ ట్రస్టు స్థాపకులు, నిర్వాహకులు అయిన శ్రీ నారాయణం నరసింహ మూర్తి గారి సంకల్పంతో వారి కుమారులు కట్టించిన అద్భుత కట్టడం ఇది.
విజయనగరం రైల్వే స్టేషన్ నుండి కోరుకొండ వెళ్ళే దారిలో 9 కి.మీ దూరంలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ కట్టడం రూపుదిద్దుకొంది.
దీనిని 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో ధనస్సు ఆకారంలో నిర్మించారు. అందులో మధ్య భాగాన 60 అడుగుల ఎత్తు గల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.
వాల్మీకి రామాయణంలోని భాగాలను 72 ఘట్టాలుగా విభజించి వాటికి సంబంధించి 72 విగ్రహాలను ఏర్పాటు చేసారు. ఆయా విగ్రహాల వద్ద నిల్చొని ఆ ఘట్టం గురించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసారు.
సందర్శకులు ఆయా విగ్రహాల గురించి తెలుసుకోదలచినపుడు అక్కడ ఏ భాషలో కావాలంటే ఆ భాషను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు.


