ప్రధాని మోదీకి వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు | YSRCP Chief YS Jagan Thanks PM Modi for FCRA Renewal of RDT | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు

Mar 24 2026 6:12 PM | Updated on Mar 24 2026 7:42 PM

YSRCP Chief YS Jagan Thanks PM Modi for FCRA Renewal of RDT

తాడేపల్లి:  రూరల్‌ డెవలప్‌ ట్ర‌స్ట్‌(ఆర్డీటీ)కి ఎఫ్‌సీఆర్‌ఏ((ఫారీన్ కంట్రిబ్యూష‌న్ రెగ్యుల‌ర్ యాక్ట్‌) పర్మిషన్లు రెన్యువల్‌ చేయడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలకు  కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య ,వైద్యం, పర్యావరణం, సామాజిక అభివృద్ధిలో ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు, తద్వారా పేదల అభ్యున్నతికి ఈ అనుమతులు మేలు చేస్తాయన్నారు. ఈ విషయంలో  కూడా చంద్రబాబు క్రెడిట్‌ చోరీ చేస్తున్నారని విమర్శించారు వైఎస్‌ జగన్‌. నిజంగా చంద్రబాబు కృషి ఉంటే పర్మిషన్ల రెన్యువల్‌కు ఏడాదికాలం ఎందుకు పట్టిందని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే వైఎస్సార్‌సీపీ, ప్రజా సంఘాలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నారు వైఎస్‌ జగన్‌.  క్రెడిట్‌ చోరీ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.


 ఇదీ చదవండి:

ఫలించిన వైఎస్సార్‌సీపీ పోరాటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement