వైఎస్సార్‌సీపీ పోరాటం ఫలించింది: సాకే శైలజానాథ్‌ | Sake Sailajanath Fires On Chandrababu And Nara Lokesh | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ పోరాటం ఫలించింది: సాకే శైలజానాథ్‌

Mar 24 2026 1:54 PM | Updated on Mar 24 2026 3:00 PM

Sake Sailajanath Fires On Chandrababu And Nara Lokesh

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ పోరాటం ఫలించిందని.. ఆర్డీటీ సేవలకు కేంద్రం ఓకే చెప్పిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ యథాతథంగా ఆర్డీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని.. ఇది ప్రజలు, వైఎస్సార్‌సీపీ పోరాట ఫలితమేనన్నారు. కానీ దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారంటూ శైలజానాథ్‌ మండిపడ్డారు.

‘‘వారి క్రెడిట్ చోరీని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆర్డీటీని కాపాడుకోవటానికి మేము చాలా పోరాటాలు చేశాం. టీడీపీ నేతలు ఎక్కడైనా ఒక్క పోరాటమైనా చేశారా?. ఆర్డీటీకి 21 ఏప్రిల్ 2025న కేంద్ర ప్రభుత్వం నిధులను ఆపేసింది. ఆ టైంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. కల్యాణదుర్గం ఇన్‌ఛార్జ్‌ తలారి రంగయ్య అమిత్‌షాని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు. పోస్టు కార్డుల ఉద్యమం నుండి పార్లమెంటులో నిరసన వరకు చాలా పోరాటాలు చేశాం. మా పోరాట ఫలితాన్ని టీడీపీ నేతలు కైవసం చేసుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు’’ అంటూ శైలజానాథ్‌ ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement