సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వంలో నవంబర్ 5వ తేదీ వచ్చినా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. దీంతో ప్రభుత్వం జీతం ఎప్పుడిస్తుందా? అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటినే జీతాలు చెల్లిస్తామంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. అయినా కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు సకాలంలో ఉద్యోగులకు జీతాలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో జీతాలు పెంచాలని ధర్నాలు చేసే ఉద్యోగులు.. చంద్రబాబు ప్రభుత్వంలో జీతాలు ఇవ్వాలని ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. జీతం కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే, జీతాలివ్వండి మహా ప్రభో.. అంటూ ఉద్యోగులు నిరసన తెలుపుతారేమోనన్న ఉద్దేశ్యంతో నిన్న రాత్రి పోలీస్, మెడికల్,టీచర్,సచివాలయ ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించింది.
ఆ జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం అప్పు చేసింది. మిగిలిన శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు ఎప్పుడొస్తాయో కూడా తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.


