అభిమాన నేత జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోకి నమస్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్
విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆదివారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓ ఫ్లెక్సీ వద్ద జగనన్నా నిండు నూరేళ్లు చల్లగా ఉండు అంటూ నమస్కరిస్తూ వాసుపల్లి కనిపించారు. అలాగే పలు సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేసేందుకు ఏర్పాట్లు చేశారు.


